Notification with one Lakh Jobs in India Post Department
mictv telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్ష ఉద్యోగాలతో నోటిఫికేషన్

August 16, 2022

Notification with one Lakh Jobs in India Post Department

దేశంలోని నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో శాఖలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను మంగళవారం వెల్లడించింది. తాజాగా జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్ట్ మ్యాన్ పోస్టులు 59,099, మెయిల్ గార్డ్ పోస్టులు 1445, మల్టీ టాస్కింగ్ పోస్టులు 37,539 వరకు ఉన్నాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఖాళీలున్నాయి. ఏపీ వరకు చూస్తే పోస్ట్ మ్యాన్ పోస్టులు 2289, మెయిల్ గార్డ్ పోస్టులు 108, మల్టీ టాస్కింగ్ పోస్టులు 1166 ఉన్నాయి. తెలంగాణలో పోస్ట్ మ్యాన్ పోస్టులు 1553, మెయిల్ గార్డ్ పోస్టులు 82, మల్టీ టాస్కింగ్ పోస్టులు 878 వరకు ఉన్నాయి. పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్ పాసవడంతో పాటు కంప్యూటర్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అయితే దరఖాస్తు తేదీలు, ఎంపిక విధానం వంటి ఇతర సమాచారం కోసం వివరణాత్మక అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.