దేశాల మధ్య రాకపోకలు బంద్.. వంతెనపై జంట పెళ్లి! - MicTv.in - Telugu News
mictv telugu

దేశాల మధ్య రాకపోకలు బంద్.. వంతెనపై జంట పెళ్లి!

October 18, 2020

Nova Scotia Couple Ties Knot On US-Canada Border.jp

కరోనా వైరస్ కారణంగా అమెరికా-కెనడా దేశాల మధ్య ఇప్పటికీ రాకపోకలు కొనసాగడం లేదు. దీంతో ఇరు దేశాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా-కెనడాకు చెందిన యువతీయువకులు వినూత్నంగా రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దులో గల బిడ్జిపై పెళ్లి చేసుకున్నారు. ఇలా వినూత్నంగా ఒకటైన జంటలో అమ్మాయిది అమెరికాలోని మేన్‌ ప్రాంతం. 

పెళ్లి కొడుకుది కెనడా. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా నుంచి కెనడాకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ నిబంధనలు వారిద్దరి పెళ్లిని అపలేదు. అమెరికా, కెనడా సరిహద్దుల్లో నదిపై ఉన్న వంతెనపైనే వారు పెళ్లి చేసుకున్నారు. పడవల్లో 30 మంది బంధుమిత్రులతో కలిసి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. ఇందుకోసం అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.