Now all in schools.. Khokho, Karrabilla: Centre
mictv telugu

ఇకపై అన్నీ పాఠశాలల్లో.. ఖోఖో, కర్రాబిళ్ల: కేంద్రం

August 8, 2022

కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇక నుంచి ఖోఖో, కర్రాబిళ్ల ఆటలను తప్పనిసరి చేస్తూ, అన్నీ పాఠశాలలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఖోఖో, కర్రాబిళ్ల ఆటలతోపాటు మొత్తం 75 ఆటలను ప్రతి బడిలో ప్రోత్సహించాలని తెలిపారు. ఈ ఆటల ద్వారా పిల్లల్లో మంచి ఉత్సహం, మానసిక ఒత్తిడి తగ్గి చదువుపై రెట్టింపు ఉత్సహం కల్గుతుందని పేర్కొన్నారు. రాను రాను ఈ ఆటలకు ప్రాముఖ్యత కూడా తగ్గుతున్న కారణంగా కర్రాబిళ్ల, కుంటుడు, పతంగులు ఎగరేయడం, సంతాళ్ వంటి ఆటలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి వివరించారు.

అంతేకాదు, స్థానిక ఆటల గురించి ప్రతి స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ప్రతి పీఈటీ ఈ ఆటలపై విద్యార్థులకు తెలిసేలా ప్రాక్టీసులు చేయించాలని సూచించారు. ఆటల పట్టికలో ఖోఖో, కర్రాబిళ్ల, కుంటుడు, పతంగులు ఎగరేయడం, సంతాళ్ కట్టి వంటి స్థానిక ఆటలను కూడా పిల్లలతో ఆడించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 75 ఆటలతెపాటు, ఆయుర్వేద, లోహ శాస్త్రాలను కూడా పాఠ్యాంశంలో చేర్చాలని కోరారు. దీనివల్ల విద్యార్థులకు చిన్నతనం నుంచే భారతీయ సంస్కృతి, కళలు, శాస్త్రాలు, ఆటల గురించి తెలుసుకునే వీలు కలుగుతుందని, ఈ ఆటలు కాలగర్భంలో కలిసిపోకుండా తరతరాలకు కొనసాగుతాయని అధికారులు వివరాలను వెల్లడించారు.