భారతీయులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి యూఏఈలో ఆ ఇబ్బందులుండవ్ - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి యూఏఈలో ఆ ఇబ్బందులుండవ్

April 23, 2022

భారతదేశం నుంచి కార్మికుల రూపంలో లేదా పర్యాటకుల రూపంలో చాలా మంది ఏడాది పొడవునా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాన్ని సందర్శిస్తుంటారు. అక్కడికి వెళ్లినప్పుడు మన రూపీ కరెన్సీని మార్చుకొని వారి కరెన్సీని వాడాల్సి ఉంటుంది. దీని వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి.

దీనికి పరిష్కారంగా అక్కడి ఆన్‌లైన్ చెల్లింపుల సంస్థ అయిన ‘నియో పే’తో మన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ఒప్పందం కుదుర్చుకొంది. దీని ప్రకారం భారతీయులు ఇక నుంచి నియోపే ఉన్న దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లో భీమ్ యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఇప్పటివరకు ఈ సౌకర్యం నేపాల్, భూటాన్‌లలో ఉండగా తాజాగా యూఏఈ చేరింది. త్వరలో సింగపూర్‌తో కూడా ఒప్పందం చేసుకునే ఆలోచనలో ఉన్నారు.