వాటర్ ట్యాక్సీలు ప్రారంభం.. దేశంలోనే తొలిసారి - MicTv.in - Telugu News
mictv telugu

వాటర్ ట్యాక్సీలు ప్రారంభం.. దేశంలోనే తొలిసారి

October 19, 2020

Now, enjoy first-ever water taxi service in Kerala backwaters..jp

భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రజలను కాపాడేందుకు ఇప్పటికే మన హైదరాబాద్ ముంపు కాలనీల్లో చిక్కుకున్నవారిని ఎన్డీఆర్‌ఎఫ్‌, సైన్యం.. బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా వానలు కురుస్తున్నాయి. దీంతో కేరళా ప్రభుత్వం ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టు దేశంలోనే మొద‌టిసారిగా వాట‌ర్ టాక్సీ సర్వీసుల‌ను ప్రారంభించింది. ఇప్పుడు ప్రయాణికుల ర‌వాణాకు సంబంధించి అల‌ప్పుజ బ్యాక్ వాట‌ర్స్‌లో ఈ వాట‌ర్ టాక్సీల‌ను ప్రారంభించింది. కాటమరాన్ డీజిల్ శక్తితో పనిచేసే ఈ టాక్సీల్లో, 10 మంది ప్రయాణీకులు ఒకేసారి ప్రయాణించవచ్చు.

ఈ వాటర్ ట్యాక్సీలు గంట‌కు 35 కిలోమీట‌ర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఎల‌క్ర్టిక్ ప‌వ‌ర్ స్టీరింగ్, సోలార్ ప్యానెల్ అమ‌రిక‌తో ఈ ట్యాక్సీల్లో ఎక్కడికైనా చేరుకోవ‌చ్చు. టూరిజనానికి ఈ సరికొత్త ట్యాక్సీలు మరింత దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. కాగా, కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పడవలు ఉపయోగిస్తుంటారు. కేరళలో సముద్రం చేరువగా ఉండటంతో టూరిజాన్ని భాగా అభివృద్ధిచేశారు. అక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా.. విదేశాల నుంచి సైతం పర్యాటకులు తరలి వస్తుంటారు.