ఫేస్‌బుక్‌ మెసెంజెర్‌.. ఇక అంతా వాయిస్‌తోనే.. అదిరిపోయే ఫీచర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్‌ మెసెంజెర్‌.. ఇక అంతా వాయిస్‌తోనే.. అదిరిపోయే ఫీచర్

October 6, 2018

ఫేస్‌బుక్, వాట్సాప్.. యూజర్ల అవసరాలను కనిపెట్టి ఎప్పటికప్పుడు ప్రత్యేక ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. చాటింగ్, వీడియోలు, డేటా.. ఏ విషయంలోనైనాసరే అన్నీ వడ్డించిన విస్తరి అన్నట్టు తెచ్చిపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకు 130 కోట్ల మంది వాడుతున్న  ఫేస్‌బుక్ మెసెంజర్‌‌ యాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది.

ttt

వాయిస్ కమాండ్ ఫీచర్‌ను మెసెంజర్ యాప్‌లోకి తీసుకురానుంది ఫేస్‌బుక్. ప్రస్తుతం దీన్ని ఈ ఫీచర్‌ను అంతర్గతంగా పరీక్షిస్తున్నామని, త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని ఫేస్‌బుక్‌ అధికారులు తెలిపారు. వాయిస్‌ కమాండ్ ఫీచర్‌ మనం చెప్పే మాటలను టెక్ట్స్‌ రూపంలోకి మారుస్తుందన్న సంగతి తెలిసిందే. యాప్‌లోని ఫీచర్ ద్వారా మనం మాటలతోనే చాటింగ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లను కూడా పంపుకోవచ్చు. అలాగే మనం ఫోన్‌ను తాకకుండానే ఆ మెసేజీని పంపుకోవచ్చు.

కాల్స్‌పైనా కంట్రోల్..

వాయిస్ కమాండ్ ఫీచర్లో మరికొన్ని హంగులు కూడా ఉన్నాయి. యాప్ నుంచి చేసే కాల్స్‌పై నియంత్రణ, రిమైండర్లను పెట్టుకోవడం వంటివి ఇందులో ఉంటాయి.