ఫ్రీ.. ఐడియా కష్టమర్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్రీ.. ఐడియా కష్టమర్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్

March 17, 2019

Now Idea users too get one year Amazon Prime membership for free, but not all and conditions apply

తన పోస్ట్‌పెయిడ్ కష్టమర్ల కోసం టెలికాం సంస్థ ఐడియా ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్రకటించింది. రూ.399 లేదా ఆపైన విలువ గ‌ల నిర్వానా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను వాడుతున్న క‌స్ట‌మ‌ర్లకు  ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం ఐడియా పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్లు ఐడియా మూవీస్ అండ్ టీవీ యాప్‌ను యాప్‌ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాక మొబైల్ నంబర్‌ను ఎంట‌ర్ చేసి ఓటీపీ ద్వారా క‌న్‌ఫాం చేసుకోవాలి. అనంతరం వ‌చ్చే అమెజాన్ ఆఫ‌ర్‌ను ఎంపిక చేసుకోవాలి. దీంతో క‌స్ట‌మ‌ర్ల‌కు ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిప్‌ను పొందవచ్చు