జీవీకే స్కాం... సుబ్బరామిరెడ్డి కూతుర్ని విచారిస్తున్న సీబీఐ - MicTv.in - Telugu News
mictv telugu

జీవీకే స్కాం… సుబ్బరామిరెడ్డి కూతుర్ని విచారిస్తున్న సీబీఐ

July 4, 2020

Pinky Reddy

ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌లో నిధుల గోల్‌మాల్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. జీవీకే సంస్థ నిర్వహణలో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్ అథారిటీ అభివృద్ధికి కేటాయించిన నిధులతో నవీ ముంబై పరిసరాల్లో జీవీకే గ్రూప్ రియలెస్టేట్ వ్యాపారం చేసినట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఉద్యోగుల జీతాలకు ఈ నిధులను ఉపయోగించినట్టు తేల్చారు. ఇదిలావుండగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పింకీ రెడ్డికి కూడా ఈ కేసులో లింకులు ఉన్నాయని ఆమె పేరు కూడా బయటకు వచ్చింది. పింకీరెడ్డి ప్రముఖ రాజకీయవేత్త, సినీ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి కుమార్తె అనే విషయం తెలిసిందే. 

పింకీరెడ్డి ట్రావెల్స్ కంపెనీలోకి కూడా నిధులు మళ్లించినట్టు ఆధారాలను సీబీఐ అధికారులు సేకరించారు. మొత్తం రూ. 750 కోట్ల నిధులు మళ్లించినట్టు గుర్తించారు. ఈ కేసులో జీవీ కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, పింకీరెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.