వాయిదాల్లో రైలు టికెట్ల కొనుగోలు! - MicTv.in - Telugu News
mictv telugu

వాయిదాల్లో రైలు టికెట్ల కొనుగోలు!

November 17, 2019

నెలసరి వాయిదాల్లో కొనుగోలు చేయడం మామూలే. స్మార్ట్‌ఫోన్ నుంచి మొదలు గృహోపకరణాలు అయిన ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ ఇలా ఏదైనా సులభమైన నెలసరి వాయిదా పద్ధతుల్లో కొనుగోలు చేసే అవకాశాన్ని వివిధ ఆర్థిక ఆసంస్థలు కల్పిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి రైలు టిక్కెట్లు కూడా వచ్చి చేరాయి. ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ప్రయాణీకులకు రైల్వే టికెట్‌లు వాయిదాల్లో కొనుగోలుచేసే అవకాశాన్ని కల్పిస్తోంది. 

Train.

ఈ ఆఫర్‌ కింద టిక్కెట్ల కొనుగోలు చేయాలంటే టికెట్ల రుసుము మొత్తం 50వేల రూపాయలు దాటి ఉండాలి. ఐటీఆర్‌సిటీసి వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అయిన యూజర్స్, గెస్ట్‌ యూజర్స్‌తో పాటు ఐఆర్‌సీటీసీ కౌంటర్ల వద్ద కూడా ఈ ఆఫర్‌ కింద టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఎవరైనా ఏ టూర్‌ ప్యాకేజీకైనా 35 రోజుల ముందు బుక్‌చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అనగా బుక్‌ చేసుకున్న 35 రోజుల ముందు మొదటి వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత 30 రోజుల్లో రెండో వాయిదా, తిరిగి ప్రయాణం చేసే తేదీనాటికి ప్యాకేజీ మొత్తం సొమ్ము చెల్లిస్తేనే ప్రయాణానికి కన్ఫర్మేషన్‌ నెంబర్‌ జనరేట్‌ అవుతుందని స్పష్టంచేసింది. ప్యాకేజీని బట్టి మొత్తం చార్జీలో 25 నుంచి 30 శాతం మొదటి పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.