NRI arrested in Hyderabad for stalking female trainee IPS officer
mictv telugu

లేడీ ఐపీఎస్‌ను వేధించడానికి అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు..

May 11, 2022

NRI arrested in Hyderabad for stalking female trainee IPS officer

అమెరికాలోని కాలిఫోర్నియాలో ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి.. హైదరాబాద్‌లో ఉండే మహిళా ఐపీఎస్‌ను అభ్యంతరకర మెసేజ్‌లతో వేధించాడు. అంతటితో ఆగకుండా ఆమెను కలిసేందుకు అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చి చివరకు పోలీసులకు చిక్కాడు. సదరు ఐపీఎస్ అధికారిణి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుణ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ తర్న్‌తరన్‌ ప్రాంతానికి చెందిన మల్‌రాజ్‌ సింగ్‌ అలౌక్‌ అమెరికాలో ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఓ మహిళా ఐపీఎస్‌ ఆఫీసర్‌ను కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో మెసేజ్‌లు చేస్తూ వేధిస్తున్నాడు. ఇటీవల ఆమె హైదరాబాద్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరైందని తెలుసుకొని అమెరికా నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చాడు. ఈనెల 1న ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి వెళ్లి వివరాలు తెలుసుకొని అధికారిణి ఉంటున్న గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఆమెపై వేధింపులకు గురిచేయడంతో , ఆమె వెంటనే ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.