ఏడడుగులు తడబడుతున్నాయి. బంధాలు ముక్కలవుతున్నాయి. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసేలోపలే మూడు ముళ్ళను తెంపేస్తున్నారు. పరిస్థితుల ప్రభావమా, మారుతున్న మనస్తత్వాలో తెలీదు కానీ విదేశాల్లో ఉంటున్న భారతీయులు అధిక శాతం విడాకులు తీసుకుంటున్నారుట. మొన్నటికి మొన్న ఇప్పటి యువతీ యువకులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మొగ్గు చూపడం లేదంటూ సర్వేలలో చేసి మరీ చెప్పారు. ఇప్పుడూమో ఈ విడాకులు. అసలేమౌతోంది భారతీయ వివాహ వ్యస్థకు అన్న డౌట్ వస్తోంది పరిస్థితులను చూస్తుంటే. సంస్కృతి, నాగరికత ఎటువైపుకు దారి తీస్తోందో కూడా తెలియడం లేదు.
వివాహబంధాన్ని సక్సెస్ ఫుల్ గా నడిపించడంలో ఎన్నారైలు ఘోరంగా విఫలం అవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకూ వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఎన్నరై భర్తలే తమ భార్యలకు విడాకులు ఇచ్చేస్తున్నారు. ఒకప్పడు ఎన్నారై సంబంధం అంటే ఎగిరి గంతేసేవారు. వెతికీ, ఎన్నాళ్ళయినా వెయిట్ చేసి మరీ ఎన్నారై అబ్బాయిలకు తమ అమ్మాయిలనిచ్చి పెళ్ళి చేసేవారు తల్లిదండ్రులు. మరి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏం చేస్తారో.
విడాకులు, వివాహ సమస్యలు భారతదేశంలో పెరుగుతున్నాయి. ఇండియాలోనే కాదు, విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తమ భాగస్వాములకు సమస్యలు సృష్టిస్తున్నారు. దీనివల్ల కొన్నేళ్ళుగా విడాకులు ఎక్కవయ్యాయి. ఏడాదికి వేల సంఖ్యలోనే విడాకులు కేసులు సమోదవుతున్నాయని దీనికి సంబంధించిన మంత్రి పార్లమెంటులో చెప్పారు. ఎన్ఆర్ఐ విడాకుల ద్వారా దాదాపు 2300 మంది విడాకులు తీసుకున్నారని, దీనికి సంబంధించి తమ దగ్గర 2372 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని విదేశాంగశాఖా సహాయ మంత్రి మురళీధరన్ చెప్పారు.
ఎన్నారైలు తమ భార్యలకు విడాకులు పంపించడం ఆంధోళన కలిగిస్తోందని మంత్రి అన్నారు. వాళ్ళు వేరే దేశంలో ఉన్నందు వల్ల చర్యలు తీసుకోవడం వలన కష్టంగా మారుతోందని చెప్పారు. ఇతర దేశాల్లోని అధికారులతో సంప్రదించి విషయాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అక్కడ చట్టాలు భిన్నంగా ఉంటాయి. విడాకులు అక్కడ సర్వ సాధారణం. మన దగ్గర విడాకులకు చాలా రోజులు పడుతుంది. విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖ దగ్గర 2000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అడ్రస్ లేకుండా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
ఈ నీళ్ళు ఓ గ్లాసెడు తాగితే చాలు…మీ ఆరోగ్యం మీ వెంటే.
బోనస్‌ను సంచుల్లో మోసుకెళ్లారు.. కట్టలే కట్టలు..