ఎన్నారై ఘనత..కరోనా పేషంట్‌కు ఊపిరితిత్తుల మార్పిడి - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నారై ఘనత..కరోనా పేషంట్‌కు ఊపిరితిత్తుల మార్పిడి

June 12, 2020

Nri exchange lungs of coronavirus patient

కరోనా వైరస్ వ్యాప్తి సమయంలోనూ వైద్యులు ధైర్యంగా అరుదైన శస్త్రచికిత్సలు చేసి మనుషులను కాపాడుతున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన అంకిత్ భరత్ అనే డాక్టర్ నేతృత్వంలో అమెరికాలోని షికాగోలో ఉన్న నార్త్ వెస్ట్రన్‌ మెడిసన్ ఆస్పత్రిలో ఓ అరుదైన ఆపరేషన్‌ జరిగింది. కరోనా వైరస్ సోకిన ఓ 20 ఏళ్ల యువతికి రెండు ఊపరితిత్తులను మార్చారు. కరోనా వైరస్ బ్రేక్ అవుట్ అయినప్పటినుంచి అమెరికాలో ఇలాంటి అరుదైన ఆపరేషన్‌ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

ఈ సందర్భంగా డాక్టర్ అంకిత్ మాట్లాడుతూ..’అమెరికాకి చెందిన ఓ 20 ఏళ్ల యువతి ఇటీవలే ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలోనే ఆమెకు కరోనా వైరస్ సోకింది. దీంతో రెండు ఊపిరితిత్తులూ పూర్తిగా పాడైపోయాయి. కరోనా వైరస్ తీవ్రంగా ఉండటం వల్ల ఆరు వారాల పాటు వెంటిలేటర్, ఎక్మోపై ఉంచాం. తాజాగా 42 గంటలు శ్రమించి ఆమె ఊపిరితిత్తులను మార్చేసాం. కరోనా వైరస్ బ్రేక్ అవుట్ అయినప్పటినుంచి అమెరికాలో ఈ ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి. ప్రపంచంలోనే తొలిసారిగా గత నెల 26న ఆస్ట్రియాలో ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ జరిగింది.’ అని తెలిపారు.