ఒకసారి మన వస్తువు పోయిందంటే ఇంక దొరకడం కష్టమే. ఎక్కడైనా మరిచిపోయిన, పొరపాటున పడిపోయిన వస్తువుల మన దగ్గరకు తిరిగి రావాలంటే ఎంతొ కొంత అదృష్టముండాలి. డబ్బులు, బంగారం వంటి విలువైన వస్తువులు పోయేయంటే ఇక మరచిపోవాల్సిందే. అవి ఎవరి కంట పడినా అంతే సంగతి. అయితే కోటి రూపాయల విలువైన నగలు బ్యాగ్‌ను ఓ వ్యక్తి క్యాబ్‌లో మరిచిపోయి..మరల పోలీసుల సాయంతో దక్కించకున్నాడు.
యూకే నుంచి నోయిడాకు ఓ ఎన్నారై కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. కుమార్తె వివాహం నిమిత్తం భారీగా బంగారు నగలును తీసుకొచ్చాడు. హోటల్‌కు వెళ్లేందుకు అంతా ఓ క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. గౌర్ పట్టప్రాంతంలోని హౌటల్ కు చేరుకున్నాక తన బ్యాగ్ మిస్సైనట్లు గుర్తించాడు. క్యాబ్ లో మర్చిపోయినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసుల ఆ క్యాబ్ డ్రైవర్‌ను వెతికి పట్టుకున్నారు. అతని కారు డిక్కీలో నగల బ్యాగును గుర్తించి ఎన్నారై కు అందించారు. నాలుగు గంటల్లోనే బ్యాగును అందించిన పోలీసులు అతడు కృతజ్ఞతలు తెలిపాడు.