NRI involved in fraud of 140 crore rupees in Apple company
mictv telugu

యాపిల్‌లో పదేళ్లు కష్టపడి రూ. 140 కోట్లు దోచుకున్న ఎన్నారై

November 2, 2022

భారత టెకీలు ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన వారని ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. అనేక ప్రఖ్యాత కంపెనీలకు మనోళ్లు సీఈవోలుగా ఉండడమే దీనికి తార్కాణం. సుందర్ పిచాయ్, సత్యనాదెళ్లలు దేశానికి ప్రతిష్ట తీసుకొచ్చారు. కానీ, కన్నింగ్ గాళ్ళు కూడా ఉంటారని ఇప్పుడు తెలుసుకోవాల్సి వస్తుంది. నెంబర్ వన్ మొబైల్స్ ఐఫోన్ తయారు చేసే యాపిల్ కంపెనీలో ఓ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఏకంగా రూ. 140 కోట్లు నొక్కేశాడు. దాదాపు పదేళ్లు ఈ తంతు నడిచింది. అయితే మనోడిని పట్టుకోవడానికి వారికి ఇంత టైం పట్టడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

వివరాల్లోకెళితే.. 52 ఏళ్ల ధీరేంద్ర ప్రసాద్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని యాపిల్ సంస్థలో 2008 నుంచి 2018 వరకు పని చేశారు. ఇదే క్రమంలో దొంగ ఇన్వాయిస్‌లు క్రియేట్ చేయడం, ఎలక్ట్రానిక్ విడి భాగాలు చోరీ చేసి విక్రయించడం, లేని సర్వీసులకు డబ్బులు వసూలు చేయడం చేసేవాడు. అయితే ఉద్యోగంలో జాయిన్ అయిన మూడేళ్ల తర్వాత అంటే 2011 నుంచి ఈ దందాకు తెరలేపాడు. అలా 17 మిలియన్ డాలర్లు దోచుకోగా ఎట్టకేలకు బయటకు పొక్కడంతో కోర్టు ముందు దోషిగా నిలబడ్డాడు. తనకు మరో ఇద్దరు వ్యక్తులు ఈ మోసంలో సహకరించినట్టు జడ్జి ముందు ఒప్పుకున్నాడు. దీంతో నిందితులకు ప్రస్తుతం పోలీస్ కస్టడీకి ఇచ్చిన కోర్టు.. తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేసింది.