Home > Featured > ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ పేర్లతో బీర్లు

ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ పేర్లతో బీర్లు

Article 370 and article 35A..

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లో మదరిండియా పేరుతో రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న ప్రవాస భారతీయుడు మైక్ దేవ్నాన్ని తన రెస్టారెంటులో రెండు బీర్లకు ఆర్టికల్ 370, ఆర్టీకల్ 35ఏ అనే పేర్లను పెట్టారు.

ఈ సందర్భంగా దేవ్నానీ మాట్లాడుతూ ప్రచారం కోసమో, వివాదం కోసమో తాను ఈ పేర్లు పెట్టలేదన్నారు. బీర్లపై ఉన్న పేర్లను చూడగానే కస్టమర్లు దానిక గురించి అడుగుతారని.. అప్పుడు మన దేశ గొప్పతనం గురించి వారికి చెప్పవచ్చని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరానికి చెందిన మైక్ 20 ఏళ్ల వయసులో ఫిలిప్పీన్స్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అప్పటి నుంచి భారత్‌కు తిరిగి రాలేదు. భారత్‌లో తనకు బంధువులు ఎవరూ లేరని.. అందుకే భారత్‌కు రావాల్సిన అవసరం తనకు ఏర్పడలేదన్నారు. అందుకే ఇండియన్ పాస్ పోర్టును గుర్తుగా ఇప్పటికీ తన వద్దే ఉంచుకున్నా అన్నారు.

Updated : 29 Aug 2019 12:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top