తమిళుడి ఘోరం.. భార్యను, కొడుకును చంపేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

తమిళుడి ఘోరం.. భార్యను, కొడుకును చంపేసి..

October 7, 2020

Nri tragedy in London

భారతమూలాలున్న ఓ వ్యక్తి లండన్ నగరంలో దారుణానికి తెగబడ్డాడు. భార్యను, ముద్దులు మూటగట్టే కొడుకును దారుణంగా చంపేసి రెండువారాల పాటు వారి శవాలతోనే గడిపాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రెంట్‌ఫోర్డ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘోరం జరిగింది. 

తమిళనాడు మూలాలున్న కుహరాజ్‌ సీతమ్‌ పరమనాథన్‌ (42) తన భార్య పూర్ణ కామేశ్వరిని, మూడేళ్ల కొడుకు కైలాస్‌ను, పెంపుడు కుక్కను రెండు వారాల కిందట చంపేశాడు. తర్వాత వారి మృతదేహాలను ఇంట్లోనే ఉంచాడు. ఆదివారం కుహరాజ్ ఇంట్లో ఫోన్ పనిచేయడం లేదని, ఏమైందో కనుక్కోవాలని ఓ వ్యక్తి నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. వారు కుహరాజ్ ఇంటికి రాగా విషయం వెలుగు చూసింది. కుహరాజ్ నెత్తురోడుతూ హాల్లో కనిపించాడు. పోలీసులు ప్రాథమిక చికిత్స చేస్తుండగా చనిపోయాడు. కామేశ్వరి, కైలాస్, పెంపుడు కుక్క మృతదేహాలు కుళ్లిపోతున్న స్థితిలో కనిపించాయి. గత నెల 21న కుహరాజ్ భార్యను, కొడుకును చంపేశాడని, ఆదివారం తనను తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. కుహరాజ్ తన భార్యతో గొడవపడేవాడని ఇరుగుపొరుగు వారు చెప్పారు. మలేసియా తమిళులైన కుహరాజ్, కామేశ్వరి 2015లో కౌలాలంపూర్‌లో పెళ్లి చేసుకున్నారు.