ఎన్‌ఆర్‌ఐ భర్త వేధింపులు తాళలేక..వివాహిత ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్‌ఆర్‌ఐ భర్త వేధింపులు తాళలేక..వివాహిత ఆత్మహత్య

May 8, 2019

ఉప్పల్‌‌లోని రమంతపూర్‌కి చెందిన జువాడి శ్రీలత(34) అనే గృహిణి, భర్త(వంశీ రావు), అత్తమామల వేధింపులు భరించలేక ముంబైలోని మేనమామ ఇంటికెళ్లి ఆత్మహత్య చేసుకుంది. శ్రీలతకి 2011లో రమంతపూర్‌కి చెందిన వంశీ రావుతో వివాహం జరిగింది. యూకేలో ఉంటున్న వంశీరావు 2012లో శ్రీలతని యూకే తీసుకేల్లాడు. అప్పటి నుండి శ్రీలత వరకట్న వేధింపులకు గురవుతుందని ఆమె సమీప బంధువులు తెలిపారు. శ్రీలత గర్భిణీ కావడంతో వంశీ రావు తల్లి ఆశాలతని యూకేకి తీసుకెళ్లారు. వరకట్న వేధింపుల క్రమంలోనే శ్రీలత యూకేలోనే పాపకు జన్మనిచ్చింది.

nri wife suicide

ఆడపిల్ల పుట్టిందని మళ్ళీ వేధింపులు ఎక్కువయ్యాయి. 2018 ఫిబ్రవరిలో యూకేలోనే ఒకేసారి ట్రైన్ నుండి దూకి ఆత్మహత్యకి ప్రయత్నించింది. భర్తపై యూకేలో కేసు నమోదు  చేస్తే 20 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడుతుందని కాంప్రమైస్ అయి ముందుకెళ్లింది. కానీ 2018 జూన్‌లో యూకే నుండి శ్రీలత.. భర్త, పాపతో హైదరాబాద్‌లోని రమంతపూర్‌కి వచ్చింది. వంశీ రావు శ్రీలత, తన పాపని రమంతపూర్‌లోనే వదిలి యూకేకు వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ కూడా పది నెలలనుండి భర్త, అత్తమామల వేధిస్తున్నా భరించిన శ్రీలత, మంగళవారం ముంబైలోని మేనమామ ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.