NRIs from these ten countries will soon be able to use UPI to transfer funds
mictv telugu

NRIలకు యూపీఐ సదుపాయం..మొదట ఈ 10 దేశాల వారికే అవకాశం..!!

January 12, 2023

NRIs from these ten countries will soon be able to use UPI to transfer funds

ఆన్‌లైన్ లావాదేవీలను పెంచేందుకు మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇప్పుడు రూపే డెబట్ కార్డులు, తక్కువ విలువ కలిగిన BHIM-UPIలావాదేవీలపై ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఇది సాధారణ వినియోగదారుని నుంచి వ్యాపారవేత్త వరకు ప్రయోజనం పొందుతారు. దీని కోసం రూ. 2,600కోట్ల ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (NPCI)ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో పది దేశాల్లోని ఎన్ఆర్ఐలు యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని వెల్లడించింది. యూపీఐ లావాదేవీలు నిర్వహించే సంస్థలు ఏప్రిల్ 30 నాటిని ఎన్ఆర్ఐలకు సేవలందించేందుకు అనుకూలంగా ఉండే సాంకేతికతను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ వో అకౌంట్స్ ఉన్న ఎన్ఆర్ఐలు తమ అంతర్జాతీయ మొబైల్ నెంబర్ల ద్వారా యూపీఐ సేవలు ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. మొదట ఈ యూపిఐను సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, బ్రిటన్ దేశాల్లోని ఎన్ఆర్ఐలకు ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.

కాగా విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఈ ఖాతాల నుంచి తాము ఉంటున్న దేశాల్లోని ఫోన్ నెంబర్ నుంచి యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 10 దేశాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎన్ఆర్ఐలు భారత్ కు వచ్చినప్పుడు కూడా ఈ యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చని పేమెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ విశ్వాస్ పటేల్ తెలిపారు. యూపీఐలోని సిమ్ బైండింగ్ భద్రతా ఫీచర్ కారణంగా భారత నెట్ వర్క్ సిమ్ కార్డులు ఉపయోగించుకోవచ్చని ఫోన్ నెంబర్లతో యూపీఐ చెల్లింపులు చేయడం సాధ్యం కాదు. త్వరలో యూపీఐ నిర్వహణ సంస్థలు ఈ కొత్త టెక్నాలజీని డెవలప్ చేసిన తర్వాత ఎన్ఆర్ఐలు తమ ఇంటర్నేషనల్ ఫోన్ నెంబర్లకు ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ వో నెంబర్లు అనుసంధానించి యూపీఐ చెల్లింపులు చేయవచ్చు.

వినియోగదారునికి డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసేందుకు, ప్రోత్సహించేందుకు ఈ పథకం యూపీఐ లైట్, UPI123PAYని అనుమతిస్తుంది. యూపీఐ డిసెంబర్ 2022లో 12.82లక్షల కోట్లతో 782.9కోట్ల డిజిటల్ లావాదేవీల రికార్డును క్రియేట్ చేసింది.