దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబానికి గడ్డురోజులేవో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన కుమారుడు రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-10లో కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో రామకృష్ణ కారులోనే ఉన్నారు. కారు ధ్వంసం కావడంతో అక్కడే వదిలేసిపోయారు. తర్వాత డ్రైవర్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎలాంటి వివరాలూ తెలియడం లేదు.
కారును నడిపింది రామకృష్ణా, డ్రైవరా అన్నది తెలియడం లేదు. తమకెవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. ఎన్టీఆర్ మరో తనయుడు హరికష్ణ 2018లో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తెలిసిందే. హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ కూడా 2014లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఎన్టీఆర్ మనవడు, నటుడు తారకరత్న ప్రస్తుతం గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.