దీపికా.. ఏంటా డ్రెస్.. సల్మాన్ ఖాన్ ఫన్నీ రియాక్షన్...వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

దీపికా.. ఏంటా డ్రెస్.. సల్మాన్ ఖాన్ ఫన్నీ రియాక్షన్…వీడియో

September 25, 2019

గత బుధవారం జరిగిన ‘ఐఫా’ అవార్డుల వేడుకలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె డ్రెస్ ప్రధానాకర్షణగా నిలిచింది. అయితే ఈ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఓ సంఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ దీపిక గౌను చూసి ఇచ్చిన రియాక్షన్‌ హైలైట్‌గా నిలిచింది. 

దీపిక ఇటు వైపు నిల్చుని మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆమె గౌను మాత్రం వెనుక మొత్తం 5, 6 అడుగుల మేరా పరిచి ఉంది. అటు వైపు నేరుగా నడిచి వస్తున్న సల్మాన్‌ దారికి.. దీపిక గౌను అడ్డు వచ్చింది. దీన్ని చూసిన ఆయన ఫన్నీగా ఏంటిది? అన్నట్లు చేయి తిప్పి, దీపికను చూస్తూ వెళ్లారు. అక్కడి మీడియా కూడా సల్మాన్‌ రియాక్షన్‌ చూసి నవ్వుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.