బాయిలర్ పేలి 9 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

బాయిలర్ పేలి 9 మంది మృతి

November 1, 2017

ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఓ థర్మల్ విద్యుత్ కేంద్రంలో బాయిలర్ పేలి 9 మంది చనిపోగా, వందమందికిపైగా గాయపడ్డారు.రాయ్‌బరేలి జిల్లా ఉంచాహార్‌లోని ఎన్టీపీసీ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ సాయంత్రం ఈ పేలుడు సంభవించింది.  ఆరో యూనిట్‌లోని  బాయిలర్ పైపును కార్మికులు తెరిచారని, ఉన్నట్టుండి పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాయిలర్ మూడు దశాబ్దాల నాటిదని, దాని మరమ్మతులు చేసి నడిపిస్తున్నారని స్థానికులు చెబుతున్నాయి. దాని స్థానంలో కొత్త బాయిలర్ ను ఏర్పాటు చేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు.