ntr and anr playing cricket Bollywood movie stars
mictv telugu

బ్యాటింగ్‌తో ఎన్టీఆర్ అదరగొట్టేసాడు‌గా (వీడియో)

November 9, 2022

ఛారిటీ కార్యక్రమం కోసం సీని పరిశ్రమకు చెందిన నటీ నటులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగానే హీరోలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ అనే తేడా లేకుండా అందరూ కలిసి మ్యాచ్‌ల్లో పాల్గొని సందడి చేయడం మనం చూస్తున్నాం. అయితే ఇది ఇప్పుడు ట్రెండ్ ఏం కాదు..పాత కాలం హీరోల నుంచి ఈ ఆనవాయితీ వస్తుంది. తాజాగా అప్పటి మ్యాచ్ దృశ్యాలు వైరల్‌గా మారాయి. బాలీవుడ్ యాక్టర్స్‌తో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలసి క్రికెట్ ఆడిన ఓ వీడియో ఇప్పుడు సందడి చేస్తోంది.

1978 లో ఓ ఛారిటీ కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ మ్యాచ్‌లో బాలీవుడ్ యాక్టర్స్ తో మన టాలీవుడ్ స్టార్స్ తలపడ్డారు. అప్పట్లోనే హీరోలతో పాటుగా హీరోయిన్లు కూడా కలసి ఆడటం విశేషం. తెలుగు టీమ్ తరపున ఎన్టీఆర్,ఏఎన్నార్ లతో పాటుగా కృష్ణంరాజు ,జయప్రద ,రావు గోపాల్ రావు , అల్లు రామలింగయ్య ,రాజబాబు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.బాలీవుడ్ జట్టులో సీనియర్ హీరోలైన అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్‌లతో పాటుగా పలువురు హీరోహీరోయిన్స్ పాల్గొన్నారు. టాలీవుడ్ వెర్సెస్ బాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ క్లిప్పింగ్‌ని మురళీ మోహన్ నటించిన ఓ సినిమాలో ఉపయోగించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నాగేశ్వరరావు అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఔటయ్యి వెళ్లిపోతున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు ఎన్టీఆర్ రావడం కనిపిస్తోంది. ఎన్టీఆర్ కూడా మంచి బ్యాటింగ్ చేస్తున్నట్లు వీడియోలో తెలస్తుంది. హీరోయిన్స్ గ్రౌండ్‌లో ఫీల్డింగ్ చేసి సందడిం చేస్తున్నారు. ఈ వీడియోను చూసి అటు క్రికెట్ అభిమానులు, ఇటు సినీ అభిమానులు మురిసిపోతున్నారు.