నందమూరి తారకరత్న మరణం…నందమూరి ఫ్యామిలీలో అంతులేని విషాదాన్ని మిగిల్చంది. తారకరత్న ఇక లేరన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకుపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ , తారకరత్న భౌతికకాయాన్ని చూసి కన్నీంటి పర్యంతమయ్యారు. ఆత్మీయుల్ని కోల్పోయిన్ ఎలా ఉంటుందో తనకు తెలుసంటూ..చాలాసార్లు అభిమానలకు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్…ఇప్పుడు తారకరత్న మరణంతో మరింతగా క్రుంగిపోయినట్లు కనిపించారు. కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ నోటి వెంట మాటలురాలేవు. చాలా సమయం మౌనంగానే ఉన్నారు. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గరి బంధువైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లతో మాట్లాడారు.
Stay strong 🥹@tarak9999 Anna 💔🥲🥹#Tarakarathna pic.twitter.com/hqP0MNVWvs
— 🎓ᴄᴀ.ʜɪᴍᴀ𝟺ɴᴛʀ.🦋 (@psycho_hima) February 19, 2023
అటు టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ తారకరత్న నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. బెంగుళూరులో తారకరత్నకు చికిత్స జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ తోపాటు విజయసాయిరెడ్డికూడా ఉన్నారు. అంతా కోలుకుండానే ఆశించారు. కానీ ఇలా జరిగేసరికి ఏ ఒక్కరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.