నాటు నాటు సాంగ్ వెనుక చరణ్, తారక్ పడ్డ కష్టాలు - Telugu News - Mic tv
mictv telugu

నాటు నాటు సాంగ్ వెనుక చరణ్, తారక్ పడ్డ కష్టాలు

March 13, 2023

natu natu song

తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ చరిత్ర తిరగరాసింది. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. విశ్వవేదికపై సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రచయిత చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. అవార్డును అనౌన్స్ చేయగానే దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ -రాం చరణ్ అభిమానుల సంతోషానికి హద్దులు లేవు. ఆస్కార్ వేదిక పైన నాటు నాటు స్టెప్పులతో దుమ్ము లేచింది. వేదిక పైన బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ ప్రకటన రాగానే ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో డాల్బీ థియేటర్‌ దద్దరిల్లిపోయింది. ఆ అవార్డుతో దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు సినీ అభిమానులు.

118 సింగ్నిచర్ స్టెప్పులు

అచ్చ తెలుగులో రాసిన ఈ పాట.. ఎంత ప్రాచుర్యం పొందిందో, అదే స్థాయిలో ఈ పాటకు చేసిన కొరియోగ్రఫీ కూడా గొప్ప పేరును సంపాదించుకుంది. ప్రేమ రక్షిత్ ఈ పాటకు స్టెప్పులు సమకూచ్చారు. ఈ నేపథ్యంలో నాటు నాటు స్టెప్స్ కోసం చరణ్, తారక్ పడ్డ కష్టాలు ఏంటన్నది తెలుసుకుని అందరు షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ పాట కోసం రాజమౌళి 118 సింగ్నిచర్ స్టెప్పులు కంపోజ్ చేయించి.. చివరికి మూడు స్టెప్పులని ఒకే చేశాడట. అయితే 50కి పైగా స్టెప్పులు చరణ్, తారక్ లతో వేయించి మరీ 3 స్టెప్స్ ని కన్ఫర్మ్ చేశాడట రాజమౌళి. ఈ పాట కోసం రూపొందించిన స్టెప్స్ సీక్వెన్స్ కోసం ఏకంగా 20 రోజులకు పైగా పట్టినట్లు చెప్పారు నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్.

ఇప్పుడు కూడా కాళ్లు వణుకుతాయి

హుక్ స్టెప్స్ కోసం చరణ్ ఎన్టీఆర్ లు మాములు కష్టం పడలేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. సింక్ లో స్టెప్స్ వేయడానికి హీరోలు ఇద్దరూ చాలా కఠినమైన రిహార్సల్స్ చేశారట. రెండు నెలల గ్రౌండ్ వర్క్ తరువాత ‘నాటు నాటు’ పాట షూటింగ్ స్టార్ట్ చేశారట. ఈ పాట కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు రోజు ఉదయం 6 గంటలకు మేల్కొని, రాత్రి 10 గంటలకు పడుకునే వాళ్ళట. వారి కోసం ఏకంగా 118 స్టెప్స్ కొరియోగ్రఫీ చేసినట్టు ప్రేమ్ రక్షిత్ చెప్పారు.   ఈ సాంగ్ షూటింగ్ సమయంలో తాను ఏకంగా నాలుగు కిలోల బ‌రువు త‌గ్గిపోయాను అని చెప్పి ఆశ్చర్యపరిచారు రామ్ చరణ్. ఆ సమయంలో పడిన కష్టం గురించి ఇప్పుడు ఆలోచించినా కూడా కాళ్లు వ‌ణుకుతాయి అని అన్నారు. నిజంగా ఎన్టీఆర్, చరణ్ పడ్డ కష్టం అంతా పాటలో స్పష్టంగా కనిపిస్తుంది. పర్ఫెక్ట్ సింక్ లో, ఈ ఇద్దరు హీరోలు పోటాపోటీగా వేసిన స్టెప్స్ చరిత్రలో నిలిచిపోతాయి.