రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించిన ఎన్టీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించిన ఎన్టీఆర్

April 1, 2022

gngcnb

‘ఆర్ఆర్ఆర్’ సినిమా సాధించిన విజయోత్సాహంతో ఉన్న జూ. ఎన్టీఆర్ అదే ఊపులో పలు జాతీయ ఛానళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్లు అడిగిన ప్రతీ ప్రశ్నకు వివరంగా జవాబిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ రంగ ప్రవేశంపై ప్రశ్నించగా.. ‘ ఈ విషయం నన్ను చాలా మంది అడుగుతున్నారు. నేను భవిష్యత్తులో ఏదో జరుగుతుందని నమ్మే వ్యక్తిని కాను. ఈ క్షణం మనం ఏం చేస్తున్నాం అనేది ఎక్కువగా పట్టించుకుంటాను. ప్రస్తుతం నటుడిగా, నా నటన మీదే పూర్తి దృష్టి పెట్టాను. మంచి సినిమాలు చేసుకుంటూ సంతోషంతా ఉన్నా’నని బదులిచ్చారు. అలాగే తాత సీనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘ సమాజం మనకు ఎంతో ఇచ్చింది. దాంట్లో కొంత మనం తిరిగివ్వాలనే విషయం తాతాగారి నుంచి నేర్చుకున్నా. అలాగే ఎలాంటి రక్త సంబంధం లేకపోయినప్పటికీ ఎంతో మంది అభిమానులున్నారు. వాళ్లను సంతోషపెట్టడానికి మంచి సినిమాలు చేయడానికి నిరంతరం తాపత్రయపడుతాన’ని వివరించారు.