జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే రూ. 900 కోట్లను వసూలు చేసింది. ఇంకొద్ది రోజుల్లో వెయ్యి కోట్ల మార్కును అందుకోబోతోంది. బాలీవుడ్లో రూ. 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను తక్కువ చేసి రాంచరణ్‌ను ఎక్కు వ హైలెట్ చేశారని ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో పూర్తిగా రాంచరణే కనిపించాడని రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు ఆవేశపడడంపై ఎన్టీఆర్ స్పందించారు. ఇద్దరు హీరోలకు రాజమౌళి సమాన స్పేస్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఒక సీన్లో నన్ను, మరో సీన్లో రాంచరణ్‌ను హైలెట్ చేశారని తెలిపారు. తన పాత్రపై తనకు ఎలాంటి అసహనం, అసంతృప్తి లేవని తేల్చి చెప్పారు. ఇద్దరినీ సమానంగా చూశారు కాబట్టి సినిమా అంత బాగా వచ్చిందని పేర్కొన్నారు.