వర్మకు ఎన్టీఆర్ షేక్‌హ్యాండ్! - MicTv.in - Telugu News
mictv telugu

వర్మకు ఎన్టీఆర్ షేక్‌హ్యాండ్!

October 21, 2017

వివాదాలతోపాటు రోజూ ఫేస్‌బుక్‌లో ఏదో ఒకటి కెలికే రాంగోపాల్ వర్మకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిద్రపట్టడనివ్వడం లేదు. ఎక్కడున్నా, ఏం మాట్లాడినా తాను తీయబోతున్న ఈ సినిమా గురించే చెబుతున్నాడు. తాజాగా శనివారం ఆయన  తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఫొటో పెట్టాడు.

ఇందులో దివంతగ ఎన్టీఆర్.. వర్మకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. వెనకవైపు.. ఎన్టీఆర్, ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతిల పెళ్లి ఫొటో ఉంది. ‘తనపైన తీస్తున్న సినిమా తీస్తున్న నన్ను అభినందిస్తున్న ఎన్టీఆర్’ అని ఫొటోపైన వర్మ కాప్షన్ రాశాడు. ఈ సినిమాను వర్మ లక్ష్మీపార్వతి కోణంలో తీస్తుండడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు, ఆయనను ఇబ్బంది పెట్టే ఇతర విషయాలు చూపితే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వారికి వర్మ కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. నిజాలే చూపుతానని స్పష్టం చేశారు.