నందమూరి నటుడు తారకరత్న గత నెల 18వ తేదిన చనిపోయారు. గుండెపోటుకు గురై 23 రోజులు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు వదిలారు. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఇప్పటికీ అభిమానులు, టీడీపీ శ్రేణులు తారకరత్న మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న చనిపోయిన 3 రోజులుకు చిన్నకర్మను నిర్వహించగా నేడు దశదిన కర్మను ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరై తారకరత్నకు నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పాల్గొని తారకరత్నకు భావోద్వేగ అంజలి ఘటించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందరేశ్వరి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తారకరత్న గుండెపోటుకు గురైన నిమిషం నుంచి అంత్యక్రియలు వరకు అన్నీ తానై చూసుకున్న బాలకృష్ణ పెద్దకర్మ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించారు. బాలకృష్ణతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
జనవరి 27న టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కాసేపు లోకేష్‌తో నడిచి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అనంతరం ఆయనను టీడీపీ కార్యకర్తలు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు గురైనట్లు గుర్తించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ తారకరత్న 23 రోజులపాటు చికిత్స పొంది మరణించారు. తారకరత్నకు రక్షించేందుకు విదేశాల నుంచి వైద్యులను తెప్పించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు.
Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ స్కాంపై కవిత కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి పోరాటం చేద్దాం.. ప్రతిపక్షాలకు పిలుపునిచ్చిన షర్మిల