రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్.. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జనార్ధన్‌కు హీరో ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం. అంతేకాదు తారక్ పై ప్రేమతో తన చేతిపై ఎన్టీఆర్ అని పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. రీసెంట్గా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో అతన్ని సమీపంలోని హాస్పిటల్లో చేర్పించారు.
ప్రమాదం జరిగిన నాటి నుంచి జనార్ధన్ కోమాలో ఉన్నాడు. ఇక అభిమాని పరిస్థితి తెలుసుకున్న ఎన్టీఆర్.. అతడి కుటుంబంతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ‘‘నువ్వు కోలుకుని రా. మనం త్వరలో కలుద్దాం’’ అంటూ అభిమానికి ధైర్యం చెప్పారు. జనార్ధన్ అమ్మగారికి ఫోన్ చేసి మరి జనార్ధన్ ఆరోగ్యం విషయమై పరామర్శించారు. అంతేకాదు దేవుడి దయతో జనార్దన్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. అప్పట్లో ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. జనార్ధన్ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు.. శోక సంద్రంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
#NTR Always Fan Of his Fans#PrayForJanardhan
pic.twitter.com/H9bhMSNjIY— 𝗡𝗧𝗥 𝗡𝗲𝘁𝘄𝗼𝗿𝗸 ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@WeLoveTarakAnna) June 29, 2022