ఎన్టీఆర్ ఫ్యాన్స్ దూషిస్తున్నారు..నటి మీరా చోప్రా ఆవేదన - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దూషిస్తున్నారు..నటి మీరా చోప్రా ఆవేదన

June 2, 2020

Ntr fans troubling actress meera chopra.jp

పవన్ కళ్యాణ్ నటించిన ‘బంగారం’ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నటి మీరా చోప్రా ఆ తరువాత అవకాశాలు లేక బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది. తాజాగా తనను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధిస్తున్నారంటూ ఎంతో ఆవేదనతో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది. 

“తారక్…నీ అభిమానులు నన్ను ఓ వేశ్య, పోర్న్ స్టార్ అని పిలుస్తారని అనుకోలేదు. నీకంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడమే దీనికంతటికీ కారణం అనుకుంటున్నా. కానీ, నీ అభిమానులు నా తల్లిదండ్రులకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు ఫీలవుతున్నారా? మీరు తప్పకుండా నా ట్వీట్ పట్ల స్పందిస్తారని ఆశిస్తున్నాను.” అంటూ ట్వీట్ లో పేర్కొంది. ఎన్టీఆర్ ను ఈ ట్వీట్ లో ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఎన్టీఆర్ స్పందించాల్సి ఉంది.