NTR fired on his fans
mictv telugu

నేను ఇక సినిమాలు చేయను అన్న తారక్

March 18, 2023

 NTR fired on his fans

ఫ్యాన్స్ కు హీరో లమీద అభిమానం మామూలుగా ఉండదు. పాపం వాళ్ళకు తమ అభిమాన హీరో మీద విపరీతంగా ప్రేమ ఉంటుంది. దాన్ని చూపించడంలో చాలాసార్లు హద్దులు దాటేస్తుంటారు. చాలామంది హీరో, హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కోవడం, రియాక్ట్ అవడం, బాలకృష్ణ లాంటి వాళ్ళు కొట్టడం కూడా జరిగాయి. ఇప్పడు జూ. ఎన్టీయార్ కూడా అదే చేశాడు. నేను నెక్స్ట్ సినిమా చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఫ్యాన్స్ మీద కోసం ప్రదర్శించాడు.

అసలేం జరిగిందంటే విశ్వక్ సేన్ మీరోగా నటించిన దాస్ కా దమ్కీ ప్రిరిలీజ్ ఫంక్షన్ కు తారక్ ముఖ్య అతిధిగా వెళ్ళాడు. అక్కడ ఎన్టీయార్ మాట్లాడుతుంటే నెక్స్ట్ సినిమా ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ గోల చేశారు. మాట్లానీయకుండా రచ్చ చేస్తున్న అభిమానుల మీద ఫైర్ అయ్యాడు తారక్. నేను నెక్స్ట్ సినిమా చేయనంటూ మండిపడ్డాడుఎన్నిసార్లు చెప్పాలి, మొన్ననే కదా చెప్పా అంటూ ఫైర్ అయ్యాడు. అయితే వెంటనే కూల్ అయిపోయి త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. కొంచెం ఆగండి. మీరపమన్నా నేను మూవీస్ చేయడం ఆపలేను. అలాగే నేను చేయడం మానేస్తే మీరు ఊరుకోరు అంటూ సరదాగా మాట్లాడేశాడు. తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు, సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాడు యంగ్ టైగగర్.

ఇక విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ ఎన్టీయార్ నేనే వాగుడుకాయనంటే తను నాకన్నా ఎక్కువ వాగుతాడు అంటూ సరదాగా కామెంట్ చేశాడు. విశ్వక్ మంచి నటుడు అంటూ పొగిడేశాడు. తన సినిమాలు చూసి, ఒక నటుడు ఇంత సెటిల్డ్ గా ఎలా యాక్ట్ చేయగలుగుతాడని ఆశ్చరపోయానని అన్నాడు. మంచి సినిమాలు చేయాలన్న పిచ్చితో విశ్వక్ తనకున్నదంతా పెట్టేసి దాస్ కా దమ్కీ చేశాడని, ఉగాది రోజున రిలీజ్ అవుతున్న ఈ సినిమా అతనికి పండుగను తెచ్చిపెట్టాలని తారక్ కోరుకున్నాడు.