ఒకేచోట ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ వేడుక.. ఫోటోలు వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఒకేచోట ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ వేడుక.. ఫోటోలు వైరల్

May 6, 2022

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ఫ్యామిలీలు గురువారం ఒకచోట వివాహ వార్షికోత్సవం వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. మే 5న ఇటు తారక్‌తోపాటు అటు ప్రశాంత్‌ నీల్‌ వివాహ వార్షికోత్సవం కావడంతో వారిద్దరు తమ ఫ్యామిలీలతో కలిసి వేడుకను జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్‌ వేదికగా ఎన్టీఆర్ ‘సరికొత్త ప్రారంభం’ అంటూ షేర్ చేశారు. దాంతో అభిమానులు ఇద్దరికి ‘ఆల్ ది బెస్ట్’ చెప్తూ, ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

మరోపక్క ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా హీరో లిస్ట్‌లో చేరిపోయారు. మరోవైపు ‘కేజీఎఫ్ -2’ చిత్రంతో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్‌ లిస్ట్‌లో చేరారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా త్వరలోనే తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని అభిమానులు ఇప్పటినుంచే భారీ అంచనాలు వేస్తున్నారు.