కొమరం భీంగా ఎన్టీఆర్ లొకేష‌న్ పిక్ లీక్ - MicTv.in - Telugu News
mictv telugu

కొమరం భీంగా ఎన్టీఆర్ లొకేష‌న్ పిక్ లీక్

December 11, 2019

Ntr 02

ప్రముఖ దర్శకుడు రాజ‌మౌళి ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లలో రూపొందిస్తున్న భారీ బ‌డ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. జూలై 30,2020న ఈ సినిమా విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో షూటింగ్ జ‌రుగుతుంది. తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీంగా నటిస్తున్న ఎన్టీఆర్‌పై కీల‌క సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. 

 

కాగా, ఈ సినిమాకి సంబంధించి ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌కి లీక్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ గెడ్డం, త‌ల‌ పాగా, న‌ల్ల‌టి దుస్తులు ధ‌రించిన ఎన్టీఆర్ ఊరిని ఉద్దేశించి ఏదో మాట్లాడుతున్న‌ట్టు లీకైన ఫొటోలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ నటి ఒలివీయా న‌టిస్తుంది. రామ్ చర‌ణ్‌తో బాలీవుడ్ అలియా జోడీ క‌డుతుంది. సముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్‌ ప‌లువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. కీర‌వాణి బాణీలు సమకూర్చుతున్నారు. ఈ సినిమాను దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.