NTR Ram Charan Hard Work Behind Natu NAtu Song
mictv telugu

నాటు నాటు వెనుక.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కష్టాలు..!

January 25, 2023

NTR Ram Charan Hard Work Behind Natu NAtu Song

ఇండియా బ్లాక్ బస్టర్ RRR ఖ్యాతి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం అయింది. వరల్డ్ బెస్ట్ అవార్డు ఆస్కార్ ని ముద్దాడేందుకు అడుగు దూరంలోనే ఉంది ఆర్ఆర్ఆర్. బెస్ట్ డ్యాన్సర్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన ‘నాటు నాటు’ పాట ఇప్పటికే ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. దాంతో ఆస్కార్ లాంఛనమే అంటున్నారు అంతర్జాతీయ క్రిటిక్స్. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కితే 99శాతం ఆస్కార్ వచ్చినట్టే అని తేల్చేస్తున్నారు. దీంతో అప్పుడే ఆస్కార్ అవార్డు అందుకున్నంత స్థాయిలో సంబరాలు మొదలైపోయాయి. సినీ, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఆర్ఆర్ఆర్ టీమ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బెస్ట్ యాక్టర్ గా అవార్డు నామినేషన్ లో ఎన్టీఆర్ పేరు లేకపోవటం కాస్త నిరాశ కలిగించే అంశమైనా.. కీరవాణి పేరు ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నామినేట్ అవ్వటం ఆ బాధని తెలియకుండా చేస్తుంది.

అయితే అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటున్న నాటు నాటు సాంగ్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ పడ్డ కష్టాలు అన్నిఇన్ని కావు. ఆస్కార్ నామినేట్ అయిన సందర్భంగా ఈ పాట విశేషాలు భారీగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాటు నాటు స్టెప్స్ కోసం చరణ్, తారక్ పడ్డ కష్టాలు ఏంటన్నది తెలుసుకుని అందరు షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ పాట కోసం రాజమౌళి 118 సింగ్నిచర్ స్టెప్పులు కంపోజ్ చేయించి.. చివరికి మూడు స్టెప్పులని ఒకే చేశాడట. అయితే 50కి పైగా స్టెప్పులు చరణ్, తారక్ లతో వేయించి మరి 3స్టెప్స్ ని కన్ఫర్మ్ చేశాడట రాజమౌళి. ఈ పాట కోసం రూపొందించిన స్టెప్స్ సీక్వెన్స్ కోసం ఏకంగా 20 రోజులు పట్టినట్లు చెప్పారు నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. హుక్ స్టెప్స్ కోసం చరణ్ ఎన్టీఆర్ లు మాములు కష్టం పడలేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. సింక్ లో స్టెప్స్ వేయడానికి హీరోలు ఇద్దరూ చాలా కఠినమైన రిహార్సల్స్ చేశారట. రెండు నెలల గ్రౌండ్ వర్క్ తరువాత ‘నాటు నాటు’ పాట షూటింగ్ స్టార్ట్ చేశారట. ఈ పాట కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు రోజు ఉదయం 6 గంటలకు మేల్కొని, రాత్రి 10 గంటలకు పడుకునే వాళ్ళట. వారి కోసం ఏకంగా 118 స్టెప్స్ కొరియోగ్రఫీ చేసినట్టు ప్రేమ్ రక్షిత్ చెప్పారు. ఎన్టీఆర్, చరణ్ పడ్డ కష్టం అంతా పాటలో స్పష్టంగా కనిపిస్తుంది. పర్ఫెక్ట్ సింక్ లో, ఈ ఇద్దరు హీరోలు పోటాపోటీగా వేసిన స్టెప్స్ చరిత్రలో నిలిచిపోతాయి.