NTR Response On His Old English Speech
mictv telugu

ఆ వివాదాస్పద ఇంగ్లీష్ స్పీచ్ పై.. ఎన్టీఆర్ హాట్ కామెంట్స్..!

January 18, 2023

NTR Response On His Old English Speech

రాజమౌళి భారీ పీరియాడికల్ డ్రామా ‘RRR’ భారత దేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాలలో కూడా మిలియన్ల హృదయాలను గెలుచుకుంది. నాటు నాటు పాట అయితే ‘ఉత్తమ ఒరిజినల్’ పాటల విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును సైతం గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ఎక్కడో దక్షిణ భారతదేశంలోని చిన్న ఇండస్ట్రీ టాలీవుడ్ నుండి వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ ప్రేక్షకులని అలరించటంపై దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రశంశలు వచ్చాయి.

ముఖ్యంగా పశ్చిమ దేశాల నుండి అనూహ్య మద్దత్తు లభిస్తుంది. గోల్డెన్ గ్లోబ్స్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డుతో రెడ్ కార్పెట్ పరిచింది. ఈ సందర్భంగా అవార్డు వేదిక నుండే ఎన్టీఆర్ స్పందించాడు. ఒక హాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ.. ఇంగ్లీష్ ఇరగదీశాడు. అయితే ఆ స్పీచ్ లో ప్రత్యేకత ఏంటంటే ప్యూర్ ఫారిన్ స్లాంగ్ లో మాట్లాడాడు ఎన్టీఆర్. అచ్చం అమెరికన్‌ యాక్సెంట్‌ ని దించేశాడు. ఆ స్పీచ్ వింటే ఎవరు తారక్ ని ఇండియన్ అని అనుకోడు. ఎప్పుడో ఫారిన్ లో సెటిల్ అయినా ఎన్నారైలా ఇంగ్లీష్ ఇరగదీశాడు.

అయితే ఆ స్పీచ్ పై కూడా కొందరు ట్రోల్స్ మొదలుపెట్టారు. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ స్పీచ్ ని పట్టుకుని ‘వచ్చి రాని భాష మనకెందుకు భయ్యా’ అని కొందరు, చక్కగా ఇండియన్ యాక్సెంట్‌లో మాట్లాడోచ్చు కదా అని ఇంకొందరు.. అచ్చమైన తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్ ఎందుకు అంటూ మరి కొందరు ట్రోల్స్ స్టార్ట్ చేశారు. అప్పటి నుండి నలుగుతున్న ఈ వివాదంపై తాజాగా ఎన్టీఆర్ ఇన్ డైరెక్ట్ గా స్పందించాడు. ఒక్కో దేశంలో ఒక్కో యాస ఉండటం సహజమని అన్నారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన సందర్భంగా ఓ అమెరికన్ వార్త సంస్థతో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. వివిధ దేశాల్లో కాలమానంలో, మాట్లాడే భాషలో తేడాలు ఉండోచ్చు కానీ.. పాశ్చాత్య దేశాల్లో ఓ నటుడు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తాడో.. అటు తూర్పు దేశాల్లో కూడా అదే విధానాన్ని ఫాలో అవుతాడని తెలిపారు. ఇక ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి గురించి మాట్లాడుతూ.. రాజమౌళి గొప్ప వ్యక్తి. తన సినిమాలతో ప్రపంచం మొత్తాన్ని అలరించే సత్తా ఉన్న వ్యక్తి. దక్షిణాదిలోని తెలుగు చిత్రసీమ నుంచి వచ్చిన ఆర్ ఆర్ ఆర్‌తో ఈ స్థాయికి, ఇక్కడి రావడం ఈ అవార్డ్‌లు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు ఎన్టీఆర్.