జపాన్ భాషలో మాట్లాడిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా - MicTv.in - Telugu News
mictv telugu

జపాన్ భాషలో మాట్లాడిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా

October 22, 2022

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన స్పీచుతో అదరగొట్టాడు. అదీ జపాన్ దేశంలో వారి భాషలో మాట్లాడి అక్కడి అభిమానులను ఆకట్టుకున్నాడు. రజనీకాంత్, అమీర్ ఖాన్ తర్వాత ఆ స్థాయి అభిమానులున్న హీరో ఎన్టీఆరే కావడం గమనార్హం. ఎన్టీఆర్ గత సినిమాల్లోని పాటలు, డ్యాన్సులను అక్కడి యువత విపరీతంగా ఆదరించారు. కొంతమంది అచ్చం ఎన్టీఆర్‌లాగే డ్యాన్సులు చేసి సోషల్ మీడియాలో పెట్టారు కూడా. ఇంత క్రేజ్ ఉండడంతో కొన్నేళ్ల కింద జపాన్ మీడియా హైదరాబాదుకు వచ్చి ఎన్టీఆర్‌ని కలిసి ఇంటర్వ్యూ తీసుకున్నారు.

ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తాజాగా జపాన్‌లో విడుదలవడంతో చరణ్, రాజమౌళితో కలిసి ఎన్టీఆర్ ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లారు. ఈ నేపథ్యంలో జరిగిన ఓ ప్రమోషన్ ఈవెంట్లో ఎన్టీఆర్ జపాన్ భాషలో మాట్లాడారు. తర్వాత ఇంగ్లీషులో ‘మిమ్మల్ని చూడగానే జపాన్ భాషలో మాట్లాడాలనిపించింది. ఏమైనా తప్పులుంటే మన్నించండి. జపాన్ రావడం నాకు ఇదే ఫస్ట్ టైం. మీ ముందు ఇలా నిలుచున్నందుకు సంతోషంగా ఉంది’ అని మాట్లాడారు. అటు ఈ టీం బస చేసిన హోటల్ వద్ద అభిమానులు భారీగా చేరుకుని సెల్ఫీలు దిగారు. ఓ అభిమాని అయితే ఎన్టీఆర్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత వారికి ఆటోగ్రాఫులు ఇస్తూ వారిని సంతోషంలో ముంచెత్తారు.