‘ఇది.. నా బ్రాండు’ అని చూపించిన ఎన్టీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఇది.. నా బ్రాండు’ అని చూపించిన ఎన్టీఆర్

April 8, 2022

 

gbcbg

సినిమా హీరోలను అభిమానించే వారు కేవలం వారి నటన, డ్యాన్సులను మాత్రమే చూడరు. హీరోలేసుకున్న డ్రెస్సులు, కార్లు, స్టైల్ అన్నింటినీ గమనిస్తుంటారు. వాళ్లకున్న అలవాట్లను కూడా ఫాలో అవుతుంటారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి ఓ విషయం అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వెయ్యికోట్ల వసూళ్లను సాధించిన సందర్భంగా ఇటీవల ఓ పార్టీ నిర్వహించారు. పార్టీకి హాజరైన ఎన్టీఆర్ ఓ ఖరీదైన వాచీని చేతికి ధరించడం కనిపించింది. అప్పటినుంచి అభిమానులు దాని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ వాచ్ ధర కోటీ డెభ్బై లక్షల రూపాయల పైమాటే. ఇంగ్లండుకు చెందిన ఆ బ్రాండెడ్ వాచీ పేరు పటెక్ ఫిలిప్ నాటిలస్ 5712. ఎన్టీఆర్ గతంలో రిచర్డ్ మిల్లేకి చెందిన 011 కార్బన్ ఎన్టీపీటీ గ్రోస్జీన్ అనే నాలుగు కోట్ల రూపాయల ఖరీదు చేసే వాచీ ధరించాడు. ఈ విషయాలు విని అభిమానులు అవాక్కవుతున్నారు. ఇవేకాక, కార్లన్నా, దుస్తులన్నా ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం. మార్కెట్‌లో కొత్త వస్తువులు, మోడళ్లు ఏం వస్తున్నాయో తరచూ కనుక్కుంటూ ఉంటాడని సన్నిహితులు చెప్తున్నారు.