పెద్ద తెర.. చిన్న తెర... తేడాలు తొలిగిపోతున్నాయా..? - MicTv.in - Telugu News
mictv telugu

పెద్ద తెర.. చిన్న తెర… తేడాలు తొలిగిపోతున్నాయా..?

July 11, 2017

ఈ మధ్య కాలంలో పెద్ద తెర హీరోలు చిన్న తెరకే అతుక్కు పోవాలని చూస్తున్నట్లుంది. హిందీలో నైతే ఎప్పటి నుంచో ఈ కల్చర్ ఉంది. మన దగ్గర మాత్రం ఈ మధ్య అది బాగా పెరుగుతున్నట్లుంది. పెద్ద హీరోలు… వారి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. అభిమానుల ఆలోచన తీరు కూడా వేరేగా ఉంటుంది. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ విషయమే తీసుకుందాం… ఈయన యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్నారు. వెండి తెరపై బాగా వెలుగుతున్నారు. మరిప్పుడు చిన్న తెరవైపు ఎందుకొచ్చారో. దీని వల్ల మరింత పేరు… ప్రేక్షకుల్లో క్రుజ్ వస్తుందని అనుకున్నట్లుంది.
అయితే బిగ్ బాస్ షో మాత్రం స్మాల్ బాస్ అవుతుందనే అభిప్రాయం జనాల్లో వచ్చేట్లుంది. మిగతా హీరోలు వేరు. తారక్ వేరు కదా. అందుకే మరీయనకు ఎవరు ఈ అడ్వైజ్ ఇచ్చారో తెలియదు కానీ… ముందు ముందు దీని ఫలితం తెలుస్తుంది. సౌత్ ఇండియన్ స్టార్టల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ముందు నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు చేశారు. చిరంజీవి దాన్ని కొనసాగించారు.

బిగ్ బాస్ అనే పేరుతో ఎన్టీ రామారావు వస్తున్నారు. చిన్ని తెరపై చూసే ప్రేపక్షుల ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. పెద్ద తెరపై అదే ప్రేపక్షుకుడు చూస్తే అప్పుడు ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది. సక్సెస్ అయితే మంచిదే కానీ అది బెడిసి కొడితే జూనియర్ ఎన్టీర్ ఇబ్బందుల్లో పడ్డట్లే కదా. ఇప్పటికే ఇలాంటి షోలు చాలా వచ్చాయి. చాలా పాపులర్ అయ్యాయి… అంతకేంటే ఎక్కువగా వివాదం అయ్యాయి… ఇలాంటి షోలను తెలుగు ప్రేక్షకులు ఏ మాత్రం ఆదరిస్తారనేది కూడా చూడాలి మరి.

పటాస్ లాంటి షో పేలినప్పుడు ఇదెందుకు పేలదూ అంటే… పేలుతే మంచిదే కానీ అదే కిందా మీదా అయితే ఇబ్బంది కదా. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ ను పెట్టి షో నడుపుతున్నప్పుడు దానికి తగ్గట్లు అన్నీ ఉండాలి కదా. కొద్ది రోజులుగా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ దీనికి హోస్ట్ అని అన్నారు. కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. ఒకే అన్పించింది. అయితే ఇది ఎంత వరకే హిట్ అవుతుందో తెలియదు.
మీలో ఎవరు కోటీశ్వరుడు తొలి మలి ఎపిసోడ్లు ఓకే…చిరు వచ్చాడు కాబట్టి జనాలు ఆ మాత్రం ఆదరించారు. ఆ తర్వాత చిరు కూడా చిన్న పిల్లలతో ఆట మొదలు పెట్టారు. అంతే చిన్ని తెరకు మంచి ఫ్యూచర్ ఉన్న రామారావు లాంటి నటుడు వచ్చారు.మిగిలిన పెద్ద హీరోలు ఏదో లాగా నెట్టుకొచ్చారు. రోజూ అదే హీరోను మళ్లీ మళ్లీ చూస్తే ఇంట్రెస్టు కూడా పోతుంది…పైగా ఆ షోలో లేడిస్, జెంట్స్ మధ్య సంబంధాలు ఎట్లా చూపిస్తారో… విలువలు… ఇతరత్రా విషయాలు కూడా చర్చకు వస్తాయి. ఇవన్నీ ఎన్టీఆర్ ఇమేజీ పై ప్రభావం చూపిస్తాయి.

ఉత్తరాదిన అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లు పెద్ద తెర నుంచి చిన్న తెరకు వచ్చారు. మళ్లీ పెద్ద తెర వైపు వెళ్లారు. కానీ తెలుగు ప్రేపక్షకుల ఆలోచన వేరు కదా. దక్షిణాదిలో మంచి నటుడు కమల్ హాసన్ ఆయన కూడా చిన్న తెరకు వస్తున్నారు. ఇవన్నీ ఇప్పటికప్పుడు మంచిగానే ఉంటాయి. ముందు ముందు ఈ స్టార్ హీరోల ఇమేజీని డ్యామేజీ చేసినా చేయోచ్చు. బయటకు వచ్చిన ప్రోమోలు… ప్రమోషన్ వీడియోలు… ఇదే విషయాన్ని చెప్తున్నాయి.

సిల్వర్ స్క్రీన్ నుంచి సెల్యూలాయిడ్ కు వచ్చిన వీళ్ల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తెలియదు. అయితే మారుతున్న కాలం తోపాటు వీరూ మారుతున్నట్లే లెక్క. సెల్ ఫోన్లల్లో జనాలు వీడియోలు బాగా చూస్తున్నారు. ఇదే ఇప్పుడున్న పెద్ద మార్కెట్. బహుషా దీన్ని కొల్లగొట్టాలని అనుకుంటున్నారేమో మరి. ఏది ఏమైనా… ఇది దక్షిణాది ప్రేక్షకుల అభిమానానికి, అంచనాలకు తగ్గకుండా ఉంటే మంచిదే.

ముందు ముందు మరింత మంది హిరోలు చిన్న తెర వైపే చూస్తున్నారట. చూద్దాం రామారావు, రానాల భవిష్యత్తు ఇక్కడ వెలిగితే ఇంకింత మంది ఇటు వైపు రావొచ్చు. అయితే అందరి భవిష్యత్తు ఒకేలా ఉండదు మరి. స్క్లీన్ చిన్న పెద్దా స్టార్లు చూడక పోయినా… జనాలు అన్నీ చూస్తారు కావొచ్చు. అన్నీ కాలపరీక్షను ఎదుర్కోవాల్సిందే. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో..