NTR’s daughter Uma Maheswari cremated in Hyderabad
mictv telugu

పాడె మోసిన బాలకృష్ణ.. అంత్యక్రియలు పూర్తి

August 3, 2022

 

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ మ‌హాప్ర‌స్థానంలో సీనియ‌ర్ న‌టుడు ఎన్టీఆర్ చిన్న కుమారై ఉమా మ‌హేశ్వ‌రి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. ఆమె దహనసంస్కారాలు భర్త శ్రీనివాస ప్రసాద్ చేతుల మీదుగా జరిగాయి. తొలుత ఆమె ఇంటి నుంచి అంతిమయాత్రను ప్రారంభించారు. అంత్యక్రియలలో బాలకృష్ణ, చంద్రబాబు, లోకేష్, రామకృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వరరావు తో పాటు నందమూరి, కంఠమనేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విదేశాల్లో ఉంటున్న ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల హైదరాబాద్ చేరుకుని, కడసారిగా తన తల్లిని చూసి బోరున విలపించారు.

మహాప్రస్థానంలో ఆమె పాడెను సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు మోశారు. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఉన్నారని, కడసారి తన తల్లిని చూసుకునేందుకే అంత్యక్రియలను ఆపినట్లు తెలిపారు. ఆమె రాగానే అంత్యక్రియల ప్రక్రియను ప్రారంభించారు.