యుద్ధం చేయకుండా రాజ్యాన్ని గెలిచాడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధం చేయకుండా రాజ్యాన్ని గెలిచాడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

November 1, 2022

అహం, అహంకారాన్ని పక్కన పెట్టి యుద్ధం చేయకుండా రాజ్యాన్ని గెలిచిన వ్యక్తి దివంగత పునీత్ రాజ్ కుమార్ అని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. మంగళవారం కర్ణాటక అసెంబ్లీలో జరిగిన పునీత్ రాజ్‌కుమార్‌కు ‘కర్ణాటక రత్న’ అవార్డు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. సూపర్ స్టార్‌గా, గాయకుడిగా, మంచి భర్తగా, స్నేహితుడిగా, తండ్రిగా, అన్నింటికి మించి మంచి వ్యక్తిత్వం కలవాడైన పునీత్‌కు ఈ అవార్డు ప్రధానం చేయడంతో అవార్డుకు సార్ధకత చేకూరింది.

నన్ను పొరుగు రాష్ట్రానికి చెందిన నటుడిగా కాకుండా ఓ కుటుంబ సభ్యుడిగా భావించిన ఆయన కుటుంబానికి ధన్యవాదాల’ని కన్నడలో మాట్లాడిన మాటలకు కన్నడిగులు ఫిదా అయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంగ్ మాట్లాడుతూ.. ‘60 ఏళ్లలో సాధించే కీర్తిని పునీత్ 21 ఏళ్లలోనే సాధించారు. 4 ఏళ్ల వయసులో తండ్రి భుజాలపై శబరిమలై రావడం చూశా. ఎన్నో గుప్త దానాలు చేసిన పునీత్.. ఎమ్జీఆర్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్‌ల సాధనకు సాటి వచ్చే వ్యక్తి’ అంటూ కొనియాడారు. ఆయన మంచి తనాన్ని చూసి లక్షలాది మంది అంత్యక్రియలకు వచ్చారని, తండ్రి పేరును చూసి కాదని కితాబిచ్చారు.