లవ్ జీహాద్.. భార్య న్యూడ్ ఫోటోలు బజారుకు.. - MicTv.in - Telugu News
mictv telugu

లవ్ జీహాద్.. భార్య న్యూడ్ ఫోటోలు బజారుకు..

April 6, 2018

రానురాను మనుషులకు సాటి మనుషులపైకంటే మతంపైనే మోజు బాగా పెరుగుతోంది. మతపిచ్చితో చేయరాని దుర్మార్గాలు చేస్తున్నారు. ఒక మతం అని కాకుండా అన్ని మతాల్లోనూ అరాచకత్వం, ఘోరాలు పెరిగిపోతున్నాయి. మతం మారాలని ఓ ప్రబుద్ధుడు తన భార్య నగ్న ఫొటోలను బజార్లో పెట్టాడు. లవ్ జీహాద్ అంటూ మతోన్మాదులు నూరిపోసిన పిచ్చితో ఈ దారుణానికి వొడిగట్టాడు. హరియాణాలోని పంచకులలో జరిగిందీ ఘటన.బాధితురాలు ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన భర్త నుంచి కాపాడాలని ఆమె వేడుకుంది. హిందువైన ఆమెను ఓ ముస్లిం యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొత్తలో బాగానే ఉండేవాడు. అయితే ఇటీవల ఆమెను ఇస్లాంలోకి మారాలంటూ వేధిస్తున్నాడు. లేకపోతే విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ‘నిన్ను ప్రేమించానేగాని, నీ మతాన్ని ప్రేమించలేదు. నాకు నా వ్యక్తిగత ఇష్టాలుంటాయి. నేనేమీ నిన్ను హిందూమతంలోకి మారాలని కోరడం లేదు. నువ్వుమాత్రం ఇలా వేధిస్తున్నావు..’ అని ఆమె వాదించింది. అయితే అతడు పట్టించుకోలేదు.

ఆమె స్నానం చేస్తున్నప్పుడు స్నేహితుడితో కలసి ఫోటోలు తీశాడు. ఇస్లాంలోకి మారకపోతే వాటిని అందరికీ పంచుతానని బెదిరించాడు. అయినా ఆమె నిర్ణయం మార్చుకోలేదు. అతడు, అతని స్నేహితులు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.