నంబర్ ప్లేటుకు రూ. 132 కోట్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

నంబర్ ప్లేటుకు రూ. 132 కోట్లు..

April 9, 2018

 కోరుకున్న నంబర్ ప్లేట్ల కోసం లక్షలు ఖర్చు చేయడం మనకు తెలుసు. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ సెంటిమెంట్లు, జాతకం, రాశుల ప్రకారం ఇష్టమైన అంకెలను వేలం పాడి మరీ గెల్చుకుంటారు. మన దేశంలో మహా అయితే రెండు, మూడు కోట్ల ధరలు ఉంటాయి. కానీ బ్రిటన్‌లో ఒక నంబర్ ప్లేటుకు రూ. 132 కోట్ల భారీ ధర నిర్ణయించారు. ప్రపంచంలో అత్యధిక ధరకు అమ్మకానికి పెట్టిన నంబర్ ప్లేటు ఇదే.

ఇంతకీ ఆ నంబర్ ఎఫ్ 1. ఈ నంబరును లగ్జరీ కార్లయిన మెర్సిడీజ్-మెక్‌లారెన్ ఎస్‌ఎల్‌ఆర్, రేంజ్ రోవర్స్, బుగటి వేరాన్‌ వంటి కార్లకు వాడుతున్నారు. 2008లో ఈ నంబరు నంబర్ ప్లేట్లు రూ.4 కోట్లకు కొన్నారు. వీటి యాజమాన్య హక్కులు కాన్ డిజైన్ ఓనర్ అఫ్జల్ కాన్ వద్ద ఉన్నాయి. ఎఫ్1 ప్లేట్‌ను రూ. 132 కోట్లకు కొంటే ప్రపంచంలో ఇదే ఖరీదైన ప్లేటు అవుతుంది. పర్స్తుతం ఈ రికార్డు రూ. 67 కోట్లు పలికిన డీ5 నంబరుపై ఉంది. దుబాయ్ వ్యాపారి బల్విందర్ సహానీ దీన్ని కొనుక్కున్నాడు.