Nupur Sharma Post Controversy.. Arrest of Three Threatened in surath
mictv telugu

నుపుర్ శర్మ పోస్టు వివాదం.. బెదిరించిన ముగ్గురి అరెస్ట్

July 16, 2022

Nupur Sharma Post Controversy.. Arrest of Three Threatened in surath

మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గినట్టు కనపడడం లేదు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. పట్టణానికి చెందిన ఓ వ్యాపార వేత్త తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో నుపుర్ శర్మ ఫోటోను పోస్ట్ చేశాడు. దీంతో ఏడుగురు వ్యక్తులు వ్యాపారికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.

సూరత్‌లో ఉండాలనుకుంటున్నావా? లేదా? చంపేస్తామని హెచ్చరించడంతో వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యాపారిని బెదిరించిన ఏడుగురు వ్యక్తులలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి పేర్లు మహ్మద్ అయాన్ అటాష్ బాజివాలా, రషీద్ భురా, అలియా మహ్మద్ అని, మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నామని పోలీస్ అధికారి జేఆర్ చౌదరి వెల్లడించారు. వీరంగా స్థానికులేనని, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. కాగా, సదరు వ్యాపార వేత్త తన పోస్టును సోషల్ మీడియా నుంచి తొలగించి క్షమాపణలు చెప్పడం కొసమెరుపు.