వీడియో : నర్సుపై తొలిరోజే సామూహిక అత్యాచారం.. తర్వాత ఏం చేశారంటే - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : నర్సుపై తొలిరోజే సామూహిక అత్యాచారం.. తర్వాత ఏం చేశారంటే

May 2, 2022

కొత్తగా కట్టిన ఆస్పత్రిలో నర్సుగా చేరిన యువతిపై తొలిరోజే సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెను హత్య చేసి, అదే ఆస్పత్రి భవనానికి ఉరేసి వేలాడదీశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాంగర్ మవూ ప్రాంతంలో న్యూ జీవన్ అనే ఆస్పత్రిని ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. అందులో పని చేయడానికి శుక్రవారం పంతొమ్మిదేళ్ల యువతి నర్సుగా ఉద్యోగంలో చేరింది. నైట్ డ్యూటీ చేయాల్సి ఉందని చెప్పడంతో యువతి రాత్రంతా అక్కడే ఉండిపోయింది. అయితే ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు.. శనివారం ఉదయానికి యువతి అదే ఆస్పత్రి భవనానికి ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. పోలీసులు వచ్చి పరిశీలించగా, యువతి రెండు చేతులు కట్టేసి ఉన్నాయి. మొదట ఆత్మహత్యగా పోలీసులు భావించారు. కానీ, యువతి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిపై సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమ్మిస్తున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందిని విచారిస్తున్నారు.