అందాల ఎంపీ మనసు దోచుకున్న బుడ్డోడు - MicTv.in - Telugu News
mictv telugu

అందాల ఎంపీ మనసు దోచుకున్న బుడ్డోడు

December 10, 2019

s Boy Pic020

నుస్రత్‌ జహాన్‌ ఈ పేరు అందరికి సుపరిచితమే. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో ఎంతో పాపులార్టీ తెచ్చుకున్నారు. తృణముల్ కాంగ్రెస్ తరుపున ఎంపీగా గెలిచిన ఈమె ఏది చేసినా సంచలనంగానే ఉంటుంది. ఆమె మాటతీరు, చేసే పనులు,అందం అన్ని విషయాల్లోనూ ఆమె తనకంటూ ఓ ప్రత్యేక తెచ్చుకున్నారు. తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఓ బెలూన్లు అమ్మె అబ్బాయితో ఫొటోలు దిగి ముద్దాడుతూ షేర్ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఆమె అభిమానులు పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. 

రోడ్డుపై బెలూన్లు అమ్ముకునే ఏడాదిన్నర వయస్సు ఉన్నా  ఓ పిల్లాడిని చూసి ఆగిపోయారు. వెంటనే అతన్ని దగ్గరకు తీసుకొని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకున్నారు. ఆ ఫొటోను షేర్ చేస్తూ బెలూన్ల కంటే ఎంతో కలర్ ఫుల్‌గా ఉన్నాడు. ఈ  వీకెండ్ ఓ ప్రత్యేకమైన వ్యక్తితో జరిగిపోతోంది అంటూ కామెంట్ పెట్టారు. ఈ క్యూట్ ఫొటోకు నెటిజన్లు పెద్ద ఎత్తున లైకులు కొడుతున్నారు.