nutrient-rich-diet-will-helps-to-promote-healthy-hair-and-skin
mictv telugu

అందంగా ఉండాలంటే పైపై పూతలొక్కటీ సరిపోవు

February 16, 2023

nutrient-rich-diet-will-helps-to-promote-healthy-hair-and-skin

కాంతివంతమైన చర్మం.. పట్టు లాంటి జుట్టు.. అందమైన గోళ్Ai.. ఏ అమ్మాయికి ఇష్టం ఉండదు.అయితే అందంగా కనిపించాలంటే పైపై పూతలు సరిపోవు. దానికి తగ్గ ఆహారమూ ఉండాలి. ఫేస్‌ ప్యాక్‌లు, బ్యూటీ క్రీమ్‌లు, హెయిర్‌ ప్యాక్స్‌, మ్యానిక్యూర్‌ ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి, తాజా చర్మం కోసం, గోళ్ళను అందంగా మార్చడానికి వాటితో పాటూ ఫుడ్ మీద కూడా శ్రద్ధ పెట్టండి నిపుణులు చెబుతున్నారు.

తాజా కూరగాయలు, హెర్బస్‌, ప్రొటీన్‌, సోయా అధికంగా ఉండే మెడిటేరియన్‌ డైట్‌ నాన్‌ స్కారింగ్‌ అలోపేసియాకు ఎఫెక్టివ్‌‌ ట్రీట్మెంట్‌ అని.. 2020 పీర్-రివ్యూ స్పష్టం చేసింది. దీనిలో 24 ఆర్టికల్స్‌ను పరిశీలించారు, 1700 మంది కంటే ఎక్కువ మంది పేషెంట్స్‌పై అధ్యయనం జరిపారు.కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, విటమిన్ A, B, C,జింక్, మెగ్నీషియంతో కూడిన.. తక్కువ గ్రైసెమిక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహారం తీసుకునే స్త్రీలకు.. మెనోపాజ్ సమయంలో జుట్టు రాలడం తక్కువగా ఉంటుందని రీసెర్చ్ లో తేలింది. బయోటిన్, విటమిన్ ఎ, సి, జింక్ లోపం వల్ల.. జుట్టు సమస్యలు పెరుగుతాయని 2019 అధ్యయనం స్పష్టం చేసింది. మొక్కల నుంచి వచ్చే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుందని 2022 అధ్యయనం స్పష్టం చేసింది.గోళ్ళల్లో కెరొటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది క్షీణించినప్పుడు గోర్లు దెబ్బతింటాయి. కాల్షియం, ఐరన్ వంటి పోషకాల లోపాలు కూడా గోరు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. బయోటిన్, విటమిన్లు ఎ, డి, జింక్ వంటి సూక్ష్మపోషకాల లోపాలు ఉన్న వ్యక్తులకు చర్మం, గోర్లు ఆరోగ్యంగా ఉండవు.
వీటిని దృష్టిలో ఉంచుకుని.. పోషకాహారం తీసుకుంటే చర్మం, జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉంటాని నిపుణులు చెబుతున్నారు.

ఫ్యాటీ ఫిష్‌..

ఫ్యాటీ ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు, చర్మానికి మేలు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌.. చర్మంలో ఇన్ఫ్లమేషన్‌, ఎరుపును తగ్గిస్తుంది. ఫ్యాటీ ఫిష్‌లో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీనిలో ఉండే విటమిన్‌ E, బయోటిన్‌.. కెరొటిన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. సాల్మన్, మెకరెల్ ఫిష్ లలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

ఎర్రదుంపలు:

చిలగడ దుంపల్లో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్‌ ఏ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ ఎ కెరొటిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కెరొటిన్‌ చర్మం, గోళ్లను ఆరోగ్యానికి అవసరం. పింక్‌ చిలగడ దుంపలో ఉండే.. ఆంథోసైనిన్‌లకు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది స్కిన్‌ ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అకాల వృద్ధాప్యాన్ని ప్రేరేపిస్తాయి.

నట్స్:

బాదం, వాల్‌నట్స్‌లో విటమిన్‌ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఆక్సిడేటివ్‌ డ్యామేజ్‌ నుంచి కణాలను రక్షిస్తుంది. విటమిన్ ఇ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మంపై ముడతలు, ఫైన్‌ లైన్స్‌, సన్‌ స్పాట్స్‌ వంటి వృద్ధాప్య సంకేతాల నుంచి రక్షిస్తుంది.

అవకాడో..

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం, గోళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒక కప్పు అవకాడో ముక్కల్లో 23 mg విటమిన్ C, 16.1 మైక్రోగ్రాముల విటమిన్ A, 5 mg విటమిన్ E ఉంటుంది.

గుడ్లు..

గుడ్లు ప్రోటీన్ రిచ్. జుట్టు కెరోటిన్ అనే ప్రొటీన్‌తో తయారవుతుంది. ప్రొటీన్లు లోపం కారణంగా.. జుట్టు పెళుసుగా మారుతుంది. ఒక పెద్ద గుడ్డులో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఆకుకూరలు,నీరు అధికంగా ఉండే ఆహారాలు జుట్టు, చర్మం, గోళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కీరా, పుచ్చకాయ, సెలెరీ, యాపిల్స్, పీచెస్, టొమాటోలు, స్ట్రాబెర్రీలు తరుచుగా తింటే మంచిది.