యువదర్శకుడు విజయ్ కుమార్ బడుగు తొలి చిత్రం తమసోమా జ్యోతిర్గమయ’పై ప్రశసంల వర్షం కురుస్తోంది. చేనేతకార్మికుల జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి రెండో లిరికల్ సాంగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ‘నువ్వొక చలనం.. నువ్వొక జ్వలనం ఆపకు నీ పయనం’ అంటూ సాగే ఈ పాటను పెద్దింటి అశోక్ కుమార్ రాశారు. ఈ పాటపై ఇంజమూరి రఘునందన్ స్పందన ఆయన మాటల్లోనే..
‘అశోక్ అన్న నమస్తే
మీరు వ్రాసిన నువ్వొక చలనం నువ్వొక జ్వలనం… ఆపకు నీపయనం….. అనే పాట వింటుంటే నా చిన్ననాటి అనుభవాలు అనుభూతులు ఒకసారి కళ్ళముంది నిలిచాయి. పాట వింటున్నంత సేపు కన్నీరాగలేదు.నాకు తెలియకుండానే కళ్ళు చెమర్చడం… కన్నీరు రావడం… నిజంగా ఇది గుండెలను తట్టే పాట… కష్ట జీవులను మీ కష్టానికి ఫలితం ఉంటుందని అధైర్యం చెందవద్దని చెప్పే పాట.
మా నాన్నగారొక మాస్టర్ వీవర్. అయినా పెట్టుబడి లేని కారణంగా కూలికి నేసేవారు. అప్పుడప్పుడు స్వంతగా నేసేవారు. అంబేద్కర్ గురించి అంతగా తెలియని ఆ కాలంలో (196-70లలో ) మా నాన్నగారు కష్టపడి మమ్మల్ని చదివించాడు. చదువనేది ఎంత ముఖ్యమో ఆనాడే మానాన్న గారు గుర్తించారు.
ఇక నేతన్నల విషయానికి వస్తే.. ఇప్పటికి చాలామంది నేతన్నల పరిస్థితి దుర్భరంగానే ఉంది. ఇప్పటికి మొండిగా అదే వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఎదుగుబోదుగులేని జీవితాలు వారివి. ప్రభుత్వాలు చేసే సహాయాలు…. చేసేవి గోరంత… చెప్పేవి కొండంతగా ఉంటున్నవి. ప్రభుత్వాల మద్దతు ఇప్పటికి అరకొరగానే ఉంటుంది.
అన్నా! మీరు రాసిన ఈ పాటను ఇప్పటికి 51 సార్లు విన్నాను. విన్నన్ని సార్లు కంట నీరే. ఎందుకన్న ఇంతగా హృద్యంగా హృదయాన్ని కదిలించేలా వ్రాసిండ్రు. ఈ పాట ఒకటే జననం…… అనే inspirational song ను మించిన Inspiretional Song అవుతది. ఐతే ఆ పాట దూకుడుగా ఉంటే ఈ పాట హృదయాన్ని కదిలించేలా ఉంది. నెమ్మదిగా ఆలోచనలకు పదును పెట్టేదిగా ఉంటుంది. నేతన్న నే కాదు…. కష్టాలెదురైన ప్రతి ఒక్కరూ ఎలా ముందుకు వెళ్లాలో… ఆటంకాలు ఎలా అధిగమించాలో…. తెలుపుతుంది ఈ పాట. ఆత్మహత్యలు ఎన్నటికీ పరిష్కారం చూపవు అనే గొప్ప సందేశం ఇందులో ఉంది. ఇంతమంచి పాటను వ్రాసి ఈ సినిమాకు ఇచ్చిన మీకు శతకోటి వందనాలు అశోక్ అన్న
నీ పనితనమును మెచ్చే కాలం వచ్చి తీరుతుంది అనే భరోసా నిజంగా నేతన్నలకు కలుగుతుందా! నేతన్నలు తమ వృత్తిని కూడా ఆ దిశలో అప్డేట్ చేసుకుంటారా! ఆ ఆత్మవిశ్వాసం వాళ్లకు కలుగుతుందా! మనమంతా (సమాజం ) చేయాల్సిన పని అదే! అందుకు ఒక మల్లేశం ఒక తమాసోమా జ్యోతిర్గమయ లాంటి సినిమాల ద్వారా మీరుచేస్తున్న ప్రయత్నం ఆ దిశలో నేతన్నల జీవితాలు సింగిడిమయం కావాలని ఆకాంక్షిద్దాం
తల్లడ మల్లడవై … వలవాల మనలేదా…. ఈ పదాల ప్రయోగం.. నిజంగా హృదయం నుంచి వచ్చిన పదాలు.
ఇక సంగీతం విషయానికి వస్తే….మనల్ని తట్టి లేపుతుంది. మనల్ని కూర్చోనివ్వదు. లే! అటువైపు చూడు… నేతన్నల గూర్చి An Emotional Journy of a Weaver గురించి చూడు -విను లే అని మనల్ని పట్టు కెళ్లి చూపెడుతుంది. That is the power of this song
ఈ పాటకు సంగీతం సమకూర్చి inspiring గా పాటపడిన ప్రశాంత్ BJ గారికి అభినందనలు. ఈ పాటకు సంబంధించి నేపథ్య దృశ్యాలు (Visual & Cut ) సమాకూర్చిన A Sravan G Kumar మరింతగా పాట హృదయాలు తాకేలా సమాకూర్చారు వారికి నా
మొత్తంగా ఒక ప్రధాన వృత్తిని కథాంశంగా గైకొని సినిమా నిర్మాణానికి పూనుకుని సాహసం చేస్తున్న దర్శకుడు విజయ్ కుమార్ బడుగు గారికి, నిర్మాత తడ్క రమేష్ గారికి, ఆర్ట్ డైరక్టర్ సాయిని భరత్ గారలకు హృదయపూర్వక అభినందనలు నువ్వొక చలనం నువ్వొక జ్వలనం… ఆపకు నీపయనం….. అంటూ చక్కటి ప్రభోదాత్మక చైతన్యవంతమైన గేయం వ్రాసిన మీకు మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు
మీ
ఇంజమూరి రఘునందన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
* బాలల హక్కుల సంక్షేమ సంఘం (BHSS)*