NZ Vs Eng 2nd Test : Ollie Pope takes a fantastic reflex catches
mictv telugu

Ollie Pope Catches : అద్భుతంగా డైవ్ చేస్తూ..ఒంటి చేత్తో.. ఓలీ పోప్ సూపర్ క్యాచ్‌లు చూడాల్సిందే (వీడియో)

February 25, 2023

NZ Vs Eng 2nd Test : Ollie Pope takes a fantastic reflex catches

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో మరోసారి బజ్ బాల్ వ్యూహంతో భారీగా(435/8) పరుగులు సాధించిన ఇంగ్లాండ్..బౌలింగ్, ఫీల్డింగ్‎లోనూ అదరగొడుతోంది. ఇంగ్లాండ్ దెబ్బకు రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 138 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. జేమ్స్ అండర్సన్ 3, జాక్ లీచ్ 3 వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించారు.

ఫీల్డింగ్ లోనూ ఇంగ్లాండ్ ఆటగాళ్లు అబ్బరుపరిచారు. మైదానంలో చురుగ్గా కదిలిన ఓలీ పోప్ ఫ్రెంట్ ఫీల్డింగ్‌ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు. జాక్ లీచ్ వేసిన 25 ఓవర్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ క్యాచ్ ను నమ్మశక్యం కాని రీతిలో అందుకున్నాడు. బంతిని హెన్నీ నికోల్స్ రివర్ స్వీప్ ఆడగా అది బ్యాట్ ఎడ్జ్ తీసుకుని అతడి హెల్మట్ కు తాకి సిల్లీ పాయింట్ దిశగా వెల్లింది. ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఓలీ పోప్ అద్భుతంగా డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో నికోల్స్ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మిచెల్ కూడా ఓలీ పోప్ సూపర్ క్యాచ్‌కు ఔటైపోయాడు. లీచ్ వేసిన 33వ ఓవర చివరి బంతిని మిచెల్ డిఫెన్స్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. ఫ్రెంట్‎లో ఉన్న ఓలీ పోప్..క్షణాల్లో బంతిని క్యాచ్ పట్టేశాడు.