nz vs ind 3rd t20 update
mictv telugu

భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్..

November 22, 2022

భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్ నిలకడా ఆడుతుంది. 14 ఓవర్లలో 120 పరుగులు చేసింది. కాన్వే 51 పరుగులు, గ్లెన్ పిలిప్స్ 47 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి మొదట ట్యాటింగ్‌కు వచ్చిన కివీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలెన్(3), మార్క్ చెప్మెన్(12) తక్కువ పరుగులకే జౌటయ్యారు. తర్వాత మరో వికెట్ పడకుండా కాన్వే, పిలిప్స్ జట్టును ఆదుకున్నారు. అర్షదీప్, సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

మూడో టీ20 ఆడిన జట్టులో ఒకే మార్పును చేసి బరిలో దిగింది టీంఇండియా. వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. వరుసగా విఫలమవుతున్న పంత్‌పై మరోసారి నమ్మకముంచారు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో సౌథీ సారథ్య బాధ్యతలు వహిస్తున్నాడు.