ఒబామాపై హత్యాయత్నం చేసిన మహిళ దొరికింది.. - MicTv.in - Telugu News
mictv telugu

ఒబామాపై హత్యాయత్నం చేసిన మహిళ దొరికింది..

November 24, 2017

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను బాంబులతో చంపడానికి యత్నించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఒబామాతోపాటు టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబాట్‌ ను చంపేందుకు హడ్సన్ ప్రాంతానికి చెందిన జూలియా ఫోఫ్ గత ఏడాది.. వారి ఇళ్లకు బాంబు పంపింది . ఆ పార్సిల్ బాంబులను భద్రతా సిబ్బంది గుర్తించడంతో ముప్పు తప్పింది. ఈ పార్సిళ్లు  ఎవరకు ఎక్కడి నుంచి పంపారన్నదానిపై దర్యాప్తు సాగిస్తున్నారు. వీటిని తీసుకొచ్చిన కొరియర్ కంపెనీ సీసీ పుటేజీ ద్వారా  జూలియా ఫోఫ్ గుట్టురట్టయింది.పార్సిల్ పై దొరికిన పిల్లి వెంట్రుకలు, జూలలియా ఇంట్లోని పిల్లి వెంట్రుకలతో సరిపోలాయి. అల్ కాయిదా చీఫ్ లాడెన్‌తో పాటు పలువురు ఉగ్రవాద నాయకులను ఒబామా హయాంలో మట్టుపెట్టారు. దీంతో వారు ఆయనను టార్గెట్ చేసుకున్నారు.